సంఘ్ సెగల్లో బీజేపీ పార్టీ నేతలకు వ్యవతిరేకంగా మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి - పార్టీని ఆర్ఎస్ఎస్ నియత్రించాలని కోరుతున్నారు. మరో మంత్రి జస్వంత్ సింగ్ - పార్టీని 'సంఘ్' అదుపు చేస్తోందని విమర్శించారు. ఈ వాదనలను మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు సుందర్ లాల్ పట్వా ఖండించారు. ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 'పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కారం కాని పక్షంలో ఆర్ఎస్ఎస్ 'నిర్ణయం' తీసుకోవలసిన పరిస్తితి అనివార్యంగా ఉంటుంది. శుక్ర, శనివారాల్లో సంఘం అధినేత భాగవత్ తో భాజపా అగ్రనేతల మంతనాలు చేయడం దీన్నే స్పష్టం చేస్తున్నాయి. భాజపా అధినాయక్ ద్వయం వాజ్ పేయ్ అద్వానీలకు సన్నిహితుడైన సుధీంద్ర కులకర్ణి కూడా సైద్ధాంతికంగా విభేదించే పార్టీకి దూరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ కలుపుకొని ముందుకు నడిచేందుకు తోడ్పడే - 'వాజ్ పేయి'జమ్ కావాలని వాదిస్తున్నారు.
జిన్నాను దేశభక్తుడిగా వ్యాఖ్యానించి... పార్టీ పదవి నుంచి అద్వానీ వైదొలగిన సమయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర బాగా కనిపించింది. ఈ ఏడాది ప్రారంభంలో సంఘ్ నేతగా సుదర్శన్ స్థానంలో భాగవత్ నియామకం జరిగినప్పుడు 'సంఘం' ఆధునిక, ఆచరణీయమైన వాదం వైపు మళ్ళినట్లు కనిపించింది. కానీ పార్టీలో భాగవత్ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. భాజపా జంట నాయకులు అద్వానీ, వాజ్ పేయి పార్టీని నడిపిన కాలంలో సంఘం నియంత్రణ పరిమితంగానే ఉండేదన్న విషయం తెలిసిందే.
Pages: -1- 2 News Posted: 1 September, 2009
|