టెన్త్ సిలబస్ లో మార్పులు
ఉన్నత విద్యా సంస్థలలో నిర్బంధ మదింపు, గుర్తింపు విధానానికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసినట్లు మంత్రి తెలియజేశారు. 'ఉన్నత విద్యలో అక్రమాలను నివారించేందుకు, నిషేధించేందుకు, శిక్ష విధించేందుకు ఒక చట్టాన్ని రూపొందించవలసిన ఆవశ్యకత ఉందని కూడా సిఎబిఇ గుర్తించింది' అని సిబల్ చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో శీఘ్రంగా వివాదాల పరిష్కారానికి విద్యా ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేయడానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక పథకానికి సిఎబిఇ మద్దతు ప్రకటించింది.
ఉచిత, నిర్బంధ విద్యకు పిల్లలకు హక్కు కల్పిస్తూ కొత్తగా శాసనం రూపకల్పన పట్ల సిఎబిఇ హర్షం ప్రకటించింది. ప్రాథమిక విద్యను అందరికీ అందుబాటులో ఉండేట్లు, వారు పాఠశాలలకు హాజరవుతూ దానిని పూర్తి చేసేట్లు చూడాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. పాఠ్య ప్రణాళికను సవరించేందుకు, టీచర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో విద్యా సంస్కరణలు తీసుకురావాలనే ప్రతిపాదనకు సిఎబిఇ మద్దతు ప్రకటించింది. బోధన, పరిశోధన రంగాలలో ప్రతిభావంతులను ఆకర్షించాలన్న ప్రతిపాదిత విధానం స్వాగతించదగినదేనని సిఎబిఇ పేర్కొన్నది.
ఈ సమావేశానికి ఆరుగురు కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల నుంచి 26 మంది మంత్రులు, 13 మంది ఎన్ జిఒ ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.
Pages: -1- 2 News Posted: 1 September, 2009
|