బాబోయ్ సీఎం చాంబర్!
అదే విషయాన్ని మీడియా పాయింట్ కు వెళ్ళి వివరించాలని సూచించారు. టిడిపి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రికి వినతిపత్రి అందజేయడానికి ఆయన చాంబర్ కు వెళుతూ వెంట రమ్మంటే వెళ్ళానని బొజ్జల తెలిపారు. జిల్లాలోని రెండు ప్రాజెక్టులు కూడా మీ కాళహస్తి నియోజకవర్గానికే వచ్చాయని ముఖ్యమంత్రి చెబితే కృతజ్ఞతలు చెప్పానని, అంతకు మించి తానేమీ అక్కడ మాట్లాడలేదని బొజ్జల తెలిపారు. మోత్కుపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళుతూ ముందు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తోడుగా రమ్మని కోరారు, పరిస్థితి బాగాలేదని ఆయన తప్పించుకున్నారు. బొజ్జలకు సంబంధించి వార్తలు న్యూస్ చానల్స్ లో రాగానే రేవంత్ రెడ్డి అమ్మో నేను వెళ్ళనందుకు మంచిదే అయింది అని ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ సోమవారంనాడు ముఖ్యమంత్రిని చాంబర్ లో కలిసి వినతిపత్రం అందజేయాల్సి ఉండగా బయట జరుగుతున్న ప్రచారాన్ని చూసి వినతిపత్రం తరువాత ఇస్తాను, అనవసర వివాదంలో తలదూర్చడం ఎందుకు అని వెళ్ళిపోయారు. ప్రధానంగా టిడిపి, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పేషీ వైపు వెళ్లడానికే జంకుతున్నారు. వినతిపత్రం అందజేయడానికి వెళితే రకరకాలుగా ప్రచారం సాగుతోందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చాంబర్ కు వెళ్లినప్పుడు ఆయన ఎలా పలకరిస్తారో, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని చమత్కరించుకోసాగారు.
Pages: -1- 2 News Posted: 1 September, 2009
|