అంగట్లో అన్నీ ఉన్నా...
మహారాష్ట్రలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టుల నుంచి వరదనీరు విడుదల చేయడంతో శ్రీరాంసాగర్ లోకి ఇన్ ఫ్లో మొదలైంది. ఒక్కసారిగా 1045 అడుగులో ఉన్న డెడ్ లెవల్ లో ఉన్న నీటిమట్టం 1058.90 అడుగులకు చేరింది. దీంతో యుద్ధప్రాతిపదికన కాకతీయ కెనాల్ ద్వారా నీటిని ఎన్ టిపిసికి గత కొద్ది రోజులుగా వదిలిపెడుతున్నారు. ప్రతీరోజూ 900 క్యూసెక్కుల నీటిని ఈ కెనాల్ ద్వారా ఎన్టీపిసికి ఇస్తున్నారు.
ఇలా ఉండగా కాకతీయ కెనాల్ పొడవునా ఎన్టీపిసి వరకు కరీంనగర్ జిల్లాలోని లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. నీరు లేక ఈ పొలాలన్నీ బీళ్ళుగా మారే పరిస్థితికి వచ్చాయి. వదిలిన ఈ నీటిని రైతులు అక్రమంగా వాడుకుంటారో అనే పరిస్థితిలు నెలకొనడంతో కెనాల్ పొడవునా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూటరీల వద్ద నిఘా ఉంచవచ్చు కానీ వందల కిలోమీటర్ల పొడవునా కెనాల్ పై అడుగడుగునా నిఘా ఉంచడం సాధ్యమయ్యే పని కాదు. కెనాల్ పక్కలో ఉన్న పంట పొలాల వారు పైపులు వేసి మోటర్లతో నీటిని తీసుకునే అవకాశాలు ఉండడంతో ఇలాంటి వారి పొలాలన్నింటినీ గుర్తించి ఆయా శాఖల విద్యుత్ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంట పొలాలలకు ఉన్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
దీనితో రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కెనాల్ లో నీరు లేకున్నా వ్యవసాయ మోటార్లతో భూగర్భ జలాలు వాడుకుని పంటలను రక్షించుకుంటున్నారు. తీరా వర్షాలు కురిసి నీరు వచ్చాక అటు కెనాల్ ను చేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
Pages: -1- 2 News Posted: 1 September, 2009
|