ఇది మార్పుల మాసం రాష్ట్రంలో 30 ఏళ్ళ కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండి కొట్టిన కాంగ్రేసేతర పక్ష నేతగా 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు 1984 ఆగస్ట్ లో పదవీ గండం ఏర్పడింది. ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించడంతో నాదెండ్ల భాస్కర్ రావు నెల రోజుల సీఎంగా రాజీనామా చేయకతప్పలేదు. దీంతో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సెప్టెంబర్ 16న పున: ప్రతిష్టులయ్యారు. దురదృష్ట వశాత్తూ సొంత పార్టీ తెలుగుదేశంలోనే స్వయానా అల్లుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటులో ఎన్టీఆర్ 1995 ఆగస్ట్ లో అధికారాన్ని మరోసారి కోల్పోయారు. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
2009 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి మార్పునకు కారణం - అననుకూల వాతావరణంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి వైఎస్ ప్రాణాలు కోల్పోవడమే! ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య ఈనెల 3న ప్రమాణం చేశారు. సంక్షోభాలకు, ముఖ్యమంత్రులను మార్చు మాసంగా రాజకీయ వర్గాల్లో సెప్టెంబర్ కి ముద్ర పడింది.
Pages: -1- 2 News Posted: 5 September, 2009
|