ఆకర్ష - 'ఆ నలుగురూ' తాజాగా తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీనటి రోజా కూడా దివంగత సీఎంను కలిసిన తరువాత తెలుగుదేశంపై విమర్శలు చేశారు. చంద్రగిరిలో తమ్ముడు రామ్మూర్తి నాయుడిని కాదని రోజాకు టిక్కెట్ ను చంద్రబాబు ఇచ్చారు. అయితే తన ఓటమికి పార్టీ నాయకులే కారణమని రోజా ఆరోపించారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రేపోమాపో కాంగ్రెస్ లో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. కానీ, ఆకస్మికంగా వైఎస్ మరణించడంతో వీరి భవితవ్యం త్రిశంకు స్వర్గమైంది. వైఎస్ తనయుడు ముఖ్యమంత్రి అయిన పక్షంలో కాంగ్రెస్ లో రోజా చేరిక సులభం కాగలదని భావిస్తున్నారు.
వీరు కాక తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎంపీగా ఎన్నికైన విజయశాంతి కూడా కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆమె కూడా కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా తిరిగారు. వైఎస్ తో పలమార్లు సమావేశమయ్యారు. విజయశాంతికి తెరాస పొలిట్ బ్యూరోలో కూడా స్థానం కల్పించలేదు. తెరాస నుంచి తన బహిష్కరణకు ఆమె ఎదురు చూస్తున్నారు. తెరాస నాయకత్వం మాత్రం ఎంపీ పదవికి విజయశాంతి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ లో చేరాలని పలువురు ప్రజారాజ్యం శాసనసభ్యులు అభిప్రాయ పడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజారాజ్యం నేతలు తాజా పరిణామాలను గమనిస్తున్నారు. పీఆర్పీ శాసనసభ్యుల మాటెలా ఉన్నా... తెరాస, తెలుగుదేశం నాయకులపై తిరుగుబాటు జండా ఎగుర వేసిన నేతల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
Pages: -1- 2 News Posted: 5 September, 2009
|