కొంప ముంచిన ఎస్ఎంఎస్
'నేను పంపిన పెక్కు ఇ-మెయిల్స్ కు సమాధానమే రాలేదు. మోసపోయానని అనుకున్నాను. నేను ఈ విషయం కొందరు స్నేహితులతో మాట్లాడినప్పుడు తమ ఇతర మిత్రులకు కూడా ఇటువంటి అనుభవాలే ఎదురైనట్లు వారు నాతో చెప్పారు. పోలీసులను ఆశ్రయించి దోషులను పట్టుకొనేట్లు చూడవలసిందని వారు నాకు సలహా ఇచ్చారు' అని కట్టిమణి తెలిపారు.
అటువంటి అనుభవానికి గురైనవారిలో కట్టిమణి ఒకరని పోలీసులు తెలియజేశారు. 'విదేశీ ఉద్యోగాల ఆఫర్లతో వంచనకు గురైనవారు అనేక మంది ఉన్నారు. విదేశీ ఉద్యోగాలపై ఆశలు రేపి డబ్బులు దండుకునే కుంభకోణం ప్రస్తుతం సాగుతోంది. అక్రమంగా డబ్బు సంపాదించడానికై ఈ మాంద్యం సమయంలో ఉద్యోగార్థులను వారు దోపిడీ చేస్తున్నారు' అని పోలీసు అధికారులు చెప్పారు.
ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు కంపెనీలు సాధారణంగా అనుసరించే పద్ధతి ఏమిటంటే అవి నేరుగా లేదా ఒక ప్రముఖ ఏజెన్సీ ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం. అవాంఛిత ఇ-మెయిల్స్ ద్వారా అవి ఎంపిక చేయవు. ఇంటర్వ్యూ ప్రశ్నావళిని గాని, ఇంటర్వ్యూ లేకుండానే ఆఫర్ లేఖలను పంపే అవాంఛిత ఇ-మెయిల్స్ ఏవైనా వచ్చినట్లయితే వాటి గురించి వెంటనే నిర్థారణ చేసుకోవడం మంచిది.
మెయిల్ లో పేర్కొన్న టెలిఫోన్ నంబర్లు, చిరునామాలు వంటి కాంటాక్ట్ వివరాలు ఎంత వరకు సరైనవో ఇంటర్నెట్ ద్వారా ధ్రువీకరించుకోవాలి. మెయిల్ లో ఇచ్చిన చిరునామాను గుర్తించడానికి ఆన్ లైన్ మ్యాప్ లను సరిచూసుకోవాలి. లేదా కంపెనీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి హెల్ప్ లైన్ వెబ్ సైట్లలో ప్రశ్నలు పంపాలి. దీని వల్ల ఎంతో సమాచారం అందగలదు.
సాధారణంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు ప్లేస్ మెంట్ రుసుము వసూలు చేయవు. ఏ కారణంగానైనా డబ్బు పంపవలసిందని ఏ సంస్థ అయినా అడిగితే అభ్యర్థులు వెంటనే డబ్బు పంపకుండా ఆ సంస్థ వివరాలను నిర్థారించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ విధంగా నయవంచన చేసేవారు ఉంటారు.
Pages: -1- 2 News Posted: 9 September, 2009
|