వరి తీపి... చెరకు చేదు
ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం దాదపు 3 కోట్ల హెక్టార్లు ఉన్నది. 2008లో ఇదే సమయంలో విస్తీర్ణం 3.6 కోట్ల హెక్టార్లని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ క్రితం వారం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తున్నది. మామూలు కన్నా 39 శాతం దిగువన వర్షపాతం లోటు ఉన్న వాయవ్య ప్రాంతంలో రైతులు మరింత ఎక్కువగా ఇరిగేషన్ కోసం పూనుకోవలసి వచ్చింది. 'ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కాని ఉత్పాదకతపై ఆ ప్రభావం గణనీయంగా ఉండకపోవచ్చు' అని రాథోడ్ పేర్కొన్నారు. అయితే, వర్షపాతం లోటు ప్రభావం పడే పంటలలో చిరుధాన్యాలు, మొక్కజొన్న ఉన్నాయని ఆయన తెలిపారు.
సింధు, గంగా పరివాహక ప్రాంతం అంతటా చెరకు పంట తీవ్రమైన నీటి కొరతకు, ఉష్ణోగ్రతపరమైన ఒత్తిడికి గురైంది. చిరుధాన్యాలు, మొక్కజొన్నకు నీటి కొరత ప్రభావం దేశంలో కొన్ని ప్రాంతాలలో వరి ధాన్యం లభ్యతపై తీవ్రంగా ప్రసరించవచ్చునని రాథోడ్ సూచించారు. అయితే, పశుగ్రాసం లభ్యత ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మారవచ్చునని కర్నాల్ లోని జాతీయ పాడిపరిశ్రమ పరిశోధనా సంస్థ (ఎన్ డిఆర్ఐ)కి చెందిన సీనియర్ సైంటిస్ట్ ఒకరు అన్నారు.
జూలై 25, ఆగస్టు 10 మధ్య రెండు వారాల పాటు కొనసాగిన వర్షాభావం వల్ల చెరకు మండలాలలోని అధిక ఉష్ణోగ్రతలు పంటల్లో కొన్ని జీవసంబంధిత మార్పులు తీసుకువచ్చి ఉంటాయి. అవి వృద్ధికి అడ్డు కావచ్చు. 'అటువంటి పరిస్థితులలో సీజన్ లో తరువాత నీటి లభ్యత ఉన్నా పంటల దిగుబడిపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు' అని రాథోడ్ అన్నారు.
దేశంలో జూలైలో చాలా వరకు మామూలు వర్షపాతం నమోదైంది. కాని జూలై 25 నుంచి రెండు వారాల పాటు నెలకొన్న వర్షాభావ స్థితి వర్షాకాలం ద్వితీయార్ధంలో వర్షపాతం లోటుకు దారి తీసింది. బంగాళాఖాతంలోను, అరేబియా సముద్రంలోను అల్ప పీడనాలు ఏర్పడితే వర్షాలు పడతాయి. మామూలుగా వర్షాకాలంలో ఏడు నుంచి పది వరకు అల్ప పీడనాలు ఏర్పడుతుంటాయి. కాని గడచిన మూడు నెలల్లో అటువంటి మూడు అల్ప పీడనాలు మాత్రమే ఏర్పడి వర్షాలు కురిసాయి.
Pages: -1- 2 News Posted: 10 September, 2009
|