'అన్నదాత' బోర్లాగ్ కన్నుమూత రెండో ప్రపంచ యుద్ధ ముగింపు దశలో ఉన్నప్పుడే ఆయన మెక్సికోలో తన కృషిని ప్రారంభించారు. ఆసియా, మధ్య ప్రాచ్యం, దక్షిణ అమెరికా, ఆఫ్రికా లలో అధిక దిగుబడినిచ్చే వరి, మొక్కజొన్న వంగడాలను అభివృద్ధి పరిచారు. అందుకే నోబెల్ కమిటీ ఆయనను 'తన తరంలో ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేని విధంగా ఆకలి ప్రపంచానికి అన్నం పెట్టాడు' అని కొనియాడింది. ఆహారాన్ని అందించడం కూడా ప్రపంచశాంతికి దోహదపడినట్టే అందుకే ఆయనను శాంతి బహుమతికి ఎంపిక చేశామని పేర్కొంది. 'జీవించడానికి మొదట కాలసింది సరైన ఆహారమేనన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి' అని ఆయన నోబెల్ శాంతి బహుమతి ప్రదాన సభలో నొక్కి చెప్పారు. 1990 ల వరకు కూడా ఆయన ఆకలి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. ఆఫ్రికాలో పేదరికం, ఆకలి సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన నూతన వ్యవసాయ పద్ధతులను బోధించారు. ప్రపంచ ఆహార సరఫరా మెరుగుదలకు కృషి చేసే వ్యక్తులను సత్కరించేందుకు ఆయన 1986లో 'ప్రపంచ ఆహార బహుమతి'ని ఏర్పాటు చేశారు. 2007లో అమెరికా కాంగ్రెస్ ప్రదానం చేసే అత్యుత్తమ పౌర సత్కారం 'కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్'ను అందుకున్నారు. అంతకు ముందు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు కూడా అందుకున్నారు.
Pages: -1- 2 News Posted: 14 September, 2009
|