ఆ జిల్లాల్లో భూ సేకరణ రద్దు! ఈ కమిటీ సూచనలవల్ల నక్సల్స్ ప్రభావం గల ఆయా రాష్ట్రాలు 16,252 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలను కేంద్రం అనుమతి కోసం సమర్పించాయి. సెప్టెంబర్ ఆఖరులోగా ఆయా ప్రాంతాల్లో మొదలయ్యే ఈ ప్రాజెక్టులకు నిధులను బడ్జెట్ కేటాయింపుల నుంచే కేంద్రం కేటాయిస్తుందని ప్రణాళికా సంఘం కార్యదర్శి సుధా పిళ్ళై చెప్పారు. ఈ మొత్తాన్ని రహదారులు, వైద్యం, విద్య, విద్యుత్, ఇతర అభివృద్ధి పనులపై వ్యయం చేస్తారు.
గిరిజన ఆధిపత్యం గల ప్రాంతాల్లో ప్రైవేట్ పెట్టుబడుల కోసం భూమి సేకరించకుండా ప్రభుత్వాన్ని ప్రస్తుత చట్టం నియంత్రించలేదు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు 33 జిల్లాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి, బీహార్ లో ఆరు, ఛత్తీస్ గఢ్ లో ఏడు, జార్ఖండ్ పది, మధ్యప్రదేశ్ లో ఒకటి, మహారాష్ట్రలో రెండు, ఉత్తరప్రదేశ్ ఒకటి, ఒరిస్సాలో ఐదు జిల్లాలను ఎంపిక చేశాయి.
Pages: -1- 2 News Posted: 15 September, 2009
|