బెనారస్ చీరలకు పేటెంట్
కాంచీపురంలో 400 మందికి పైగా చిన్న స్థాయి, భారీ విక్రేతలు బాగా లాభాలు దండుకుంటున్నారు. సహకార సంస్థలు దాదాపు రూ. 75 కోట్ల టర్నోవర్ సాధిస్తుండగా, ప్రైవేట్ వర్తకులు రూ. 100 కోట్లు విలువ చేసే అమ్మకాలు సాగిస్తున్నారని కాంచీపురం కేంద్రంగా గల వైఎంఎన్ సిల్క్స్ సంస్థ యజమాని వై.ఎం. నారాయణస్వామి చెప్పారు. ఈ చీరల నేత కార్మికులకు మరింత నష్టం కలిగిస్తూ కాంచీపురం పట్టు చీరల పేరిట నకిలీ చీరల అమ్మకాలు జరుగుతున్నాయి. రసాయనికి జరీతో మరమగ్గాలపై నేసిన చీరలను చేతితో నేసిన కంచి పట్టు చీరలుగా విక్రయిస్తున్నారు.
తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని దాదాపు 100 గ్రామాలలో పట్టు చీరలు నేస్తుంటారు. అసలు సిసలు కంచి జరీ ఖరీదు ఒక గ్రాముకు రూ. 27 కాగా రసాయనిక జరీ ఖరీదు గ్రాముకు ఒక రూపాయి మాత్రమే. నకిలీ పట్టు చీరలను తక్కువ ఖర్చుతో తయారు చేసి కంచికి పంపి, తక్కువ ధరలకు సిసలైన పట్టు చీరలుగా విక్రయిస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు.
బెనారస్ లో హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన రజనీకాంత్ పూనుకుని నేత కార్మికులను సమీకరించి జిఐ వల్ల సిద్ధించే ప్రయోజనాల గురించి వారికి వివరించారు. 'చౌక చైనీస్ వస్త్రాలు, సూరత్ మిల్లు నుంచి నకిలీ చీరలు కుప్పతెప్పలుగా రాకుండా రక్షణ పొందడానికి నేత కార్మికులకు ఇది ఎంతో తోడ్పడుతుంది' అని ఆయన అన్నారు.
జిఐ సర్టిఫికెట్ ను వాణిజ్య స్థాయిలో సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల బెనారస్ నేత కార్మికులు తమ మార్కెట్ వాటాను పెంచుకోగలరని ప్రాజెక్ట్ డిప్యూటీ కో-ఆర్డినేటర్, అంక్టాడ్ ఇండియా ప్రోగ్రామ్ ఆఫీసర్-ఇన్-చార్జి అభిజిత్ దాస్ అభిప్రాయం వెలిబుచ్చారు. కాగా, అంక్టాడ్ జోక్యం ఫలితంగా జిఐ సర్టిఫికెట్ లభించిన ఐదవ ఉత్పత్తి ఇది. ఒరిస్సాకు చెందిన పిప్లి అప్లిక్ కళకు, లక్నో చికన్ క్రాఫ్ట్ కు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఉప్పాడ జందాని చీరలు, కన్ననూర్ హోమ్ ఫర్నిషింగ్ కు జిఐ సర్టిఫికెట్లు లభించడానికి ఈ సంస్థ ఇంతకుముందు కృషి చేసింది.
Pages: -1- 2 News Posted: 18 September, 2009
|