గడ్డంపై కేసీఆర్ సీరియస్! దీన్నంతా పరిశీలించిన కెసిఆర్ హ డావుడిగా అందుబాటులో ఉన్న సీని యర్ నేతలు, కొందరు పొలిట్ బ్యూరో సభ్యులను పిలిపించుకున్నారు. ఈటెల రాజేందర్, నాయిని నరసింహా రెడ్డి, మరి కొందరు అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు సమాచారం. మొదట ఈటెల, నాయిని వెళ్ళి కెసిఆర్‌ను కలసి పరిణామాలను వివరించారు. ఆ తర్వాత మరి కొందరు నేతలు వెళ్ళారు.
పరిస్థితిపై చర్చించేందుకు వచ్చిన నేతలపై కెసిఆర్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజాకోర్టు పెట్టి తేలుద్దామంటే అంగీకరించలేదని, ఫలితంగా అరవింద్ మరింత రెచ్చి పోయి మాట్లాడారని కెసిఆర్ అన్నట్టు సమాచారం. పార్టీ ఇప్పుడిప్పుడే ఒక గాడిలో పడుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ధిక్కార స్వరం వినిపించటం, అదే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవటం లాంటి పరిణామాలను చూస్తూ ఊరుకోరాదన్న అభిప్రాయం తో కెసిఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. ఇలానే ఉంటే మరి కొన్ని తలలు ధిక్కారంగా మాట్లాడే అవకాశానికి ఆజ్యం పోసినట్టవుతుందని, అలాం టప్పుడు పొలిట్ బ్యూరో, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రయోజనం ఏమిటని కెసిఆర్ ప్రశ్నించినట్టు సీనియర్ నేతలు కొందరు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 19 September, 2009
|