'ధారిద్యరేఖ దిగువన ఉన్న ప్రజలను 50 శాతంగా నిర్ణయిస్తే అది అనేక ఆర్థిక విపరిణామాలకు దారితీస్తుంది. ఇక ఆ శాతాన్ని తగ్గించేందుకు అవకాశం ఉండదు' అని ప్రణాలికా కమిషన్ - సక్సేనా కమిటీకి లేఖ రాసింది! ఆహార శాఖ గణాంకాల ప్రకారం దేశంలో దారిద్య రేఖ దిగువన ఉన్న ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డులు 10.5 కోట్లు ఉన్నాయి. దాదాపు 53 కోట్ల మంది ప్రజలు... అంటే సగం జనాభా పేదరికంలో మగ్గుతున్నట్లే కదా!
కానీ రాష్ట్రాల వారీగా పేదల లెక్కలతో ప్రణాళికా సంఘమే కాకుండా సక్సేనా కూడా విభేదిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 80 శాతం జనాభా పేదలేన్న అంశాన్ని సక్సేనా ఆక్షేపించారు. 1973-74లో 56 శాతంగా ఉన్న పేదలు - 2004 నాటికి 28 శాతానికి తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో పేదల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదన్నది ఈ కమిటీ అభిప్రాయం! మారుమూల గ్రామాల్లో ప్రజలకు 'గొంతు' లేని కారణంగానే వారు పేదరిక నిర్మూలన పథకాలకు దూరంగా ఉంటున్నరని కమిటీ విశ్లేషణ.