ఆ మహిళల తీరే వేరు
'తాము డబ్బు కోసం తీవ్రవాద గ్రూపుల వద్ద పని చేస్తున్నామని అరెస్టయిన గృహిణులు అంగీకరించారు' అని తూర్పు ఇంఫాల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) టిహెచ్. రాధేశ్యామ్ సింగ్ మీడియాతో చెప్పారు. పొత్తిళ్ళలో పసిబిడ్డలతో మరి ముగ్గురు గృహిణులను కూడా జిల్లాలోని ఇతర ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
దేవన్ వద్ద నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేసేందుకు కిరణ్ మాల తన పది మాసాల శిశువును తీసుకువెళ్ళింది. సెక్ మైజిన్ గ్రామానికి చెందిన ఓక్రమ్ పుష్పాదేవి (29), తపోక్పి గ్రామానికి చెందిన అషంగ్ కసుంగ్టి (29), పురుమ్ ఖులెన్ సొగొల్మాంగ్ గ్రామానికి చెందిన అంజు థాపా (25) కూడా తమ పసిబిడ్డలను వెంట పెట్టుకుని ఇంఫాల్ లో హెల్త్ క్లినిక్ లు, వాణిజ్య సంస్థలకు డిమాండ్ నోట్ లు అందజేశారు.
'ఈ మహిళలు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. వీరు తీవ్రవాదుల డబ్బు ఎరకు లొంగిపోతుంటారు. ఈ ధోరణి చాలా కలవరపాటు కలిగిస్తున్నది' అని రాధేశ్యామ్ సింగ్ పేర్కొన్నారు. చంకలో పసిపిల్లలు ఉన్న యువతులను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా భద్రతా దళాలు వదలివేస్తుండడాన్ని తీవ్రవాదులు అవకాశంగా తీసుకొంటుండవచ్చునని ఇతర పోలీస్ అధికారులు అంటున్నారు.
అయితే, హక్కుల సంఘాల నాయకుల నుంచి విమర్శలు రావచ్చుననే భయంతో పోలీసులు 'అనుమానాస్పద రీతిలో తమ తమ ప్రాంతాలలో పొత్తిళ్ళలో శిశువుతో సంచరించే ఏ మహిళ గురించైనా' తమకు సమాచారం అందజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Pages: -1- 2 News Posted: 22 September, 2009
|