స్త్రీలకు 'కొరడా' చికిత్స!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/NAMAKKAL1.gif' align='right' alt=''>
ఒక సమీప గ్రామంలో 12వ తరగతి చదువుతున్న, కొరడా దెబ్బ తిన్న వనిత అనే విద్యార్థిని బాధతో తన చేతులు రెండూ పట్టుకున్నది. వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమె తన తల్లిదండ్రులు పట్టుపట్టడం వల్లే తాను క్యూలో కూర్చొనవలసి వచ్చిందని 'ది హిందూ' పత్రిక విలేఖరితో చెప్పింది. ఆమె చదువు పట్ల అంతగా ఆసక్తి కనబరుస్తుండక పోతున్నందున ఆమెను ఏదో దుష్ట శక్తి ఆవహించి, ఎక్కువ మార్కులు సాధించకుండా అడ్డుకుంటున్నదని వారు భావించారు. 'వారు నన్ను బలవంతపెట్టారు. మానసిక వైక్లబ్యాలను నయం చేసేదిగా పేరొందిన ఈ ఉత్సవానికి నేను హాజరయ్యానని తెలిస్తే నా మిత్రులు ఇక నా వైపు అనుమానంతో చూస్తారు' అని ఆమె చెప్పింది.
తన ఇష్టానికి విరుద్ధంగా కొరడా దెబ్బలు తిన్న, స్వస్థలంలో అపప్రథను ఎదుర్కొంటువ్న విద్యార్థిని వనిత ఒక్కర్తే కాదు. ఆమె వయోవర్గంలోని, ఇంకా చిన్నవారైన 11, 12 ఏళ్ళ వయోవర్గంలోని చాలా మంది విద్యార్థినులు కూడా తమను బాగా చదువుకోనివ్వని అతీత శక్తులను విముక్తి పొందడానికి ఇలా బాధాకరంగా కొరడా దెబ్బలు తిన్నారు.
దిండిగల్ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన దాదాపు 16 సంవత్సరాల యువతిని 'ఈ కొరడా దెబ్బల మైదానానికి' తీసుకువచ్చారు. కారణం ఆమె ఇంకా పుష్పవతి కాకపోవడం. రుతుక్రమం సరిగ్గా లేని మరొక యువతిని కూడా ఇదే ప్రదేశానికి తీసుకువచ్చారు. ఈమధ్యే వివాహం జరిగిన ఒక యువతి కూడా తన భర్త వెంట ఈ ప్రదేశానికి వచ్చింది. తనను 'దుష్టశక్తులు ఆవహించాయ'ని తన అత్తమామలు చెప్పారని ఆమె తెలియజేసింది.
'మహిళలను వేధించే అన్ని రకాల శారీరక, మానసిక రుగ్మతలు ఒక కొరడా దెబ్బతో నయం అవుతాయి' అని గత పదేళ్లుగా ఈ ఆలయంలో కొరడా దెబ్బలు తింటున్న చెల్లి అనే 60 ఏళ్ళ మహిళ తెలియజేసింది. కొరడా దెబ్బల గుర్తులు ఆమె చేతులపై కనిపిస్తున్నాయి.
ఇంకా కౌమార దశలో ఉన్న బాలికలపై కొరడాలు ఝళిపించడమనే పద్ధతి నేరం కాదా అనే ప్రశ్నకు ఆలయ పూజారి, సమన్వయకర్త, కురుంబర్ వంశానికి చెందిన కుళ్ళ గౌండన్ ఇది నేరం కాదని సమాధానం ఇచ్చారు. 'ఇది భక్తుల విశ్వాసం. ఇది ఎంతో కాలంగా సాగుతున్న ఆచారం. మేము మార్చజాలం' అని ఆయన చెప్పారు. మంగళవారం ముగిసిన ఈ ఉత్సవం కోసం సుమారు వెయ్యి మంది వచ్చారు.
Pages: -1- 2 News Posted: 30 September, 2009
|