అది హెల్మెట్టే, కాని...
హెల్మెట్ ఔటర్ షెల్ లో సర్క్యూట్ బోర్డు, జిపిఎస్, బ్లూటూత్, ఏక్సెలెరోమీటర్, బ్యాటరీని అమర్చారు. ఇక హెల్మెట్ అంతర్భాగంలో థర్మోకోల్ లైనింగ్ ఉంటుంది. హెల్మెట్ కు సంబంధించిన కీలకమైన భద్రత నిబంధనలను ఉల్లంఘించకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
మరి ఈ సర్క్యూట్ ప్రమాదం ధాటిని తట్టుకోగలదా అనే ప్రశ్నకు సహ సృష్టికర్త, రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ డిజైన్ విద్యార్థి మొహిత్ మిత్తల్ సమాధానం ఇస్తూ, షాక్ ను, ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే విడిభాగాలను మాత్రమే తాము ఉపయోగించినట్లు చెప్పారు. 'హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే సర్క్యూట్ పని చేయడం ప్రారంభిస్తుంది. అందువల్ల హెల్మెట్ యాదృచ్ఛికంగా జారి కిందపడినప్పటికీ ఈ సిస్టమ్ పని చేయదు. అదేవిధంగా హెల్మెట్ ధరించినప్పుడే, ఆల్కహాల్ డిటెక్టర్ రైడర్ పరిమితికి లోబడే మద్యం సేవించాడనే నిర్థారించిన తరువాతే బైక్ స్టార్ట్ అవుతుంది. ఇందుకోసం బైక్ ఇగ్నీషన్ సిస్టమ్ ను బ్లూటూత్ సాధనానికి అనుసంఘానించవలసిన అవసరం ఉంటుంది' అని మిత్తల్ వివరించారు.
ఆ విద్యార్థులు ఇద్దరూ ఆ హెల్మెట్ కు డిజైన్ చేసి పక్కాగా తయారు చేయడానికి ఐదు నెలలు తీసుకున్నారు. వారు చాలా వరకు విడిభాగాలను విదేశాల నుంచి తెప్పించుకున్నారు. 'ఇందుకు మాకు రూ. 12 వేలు ఖర్చయింది. కాని హెల్మెట్ ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసినట్లయితే, బిల్లును రూ. 6000కు తగ్గించవచ్చు' అని గుప్తా తెలిపారు. కాగా, 'ఇందుకు పేటెంట్ సంపాదించడంలో వారిద్దరికీ ఐఐటి సాయం చేస్తున్నది' అని విద్యార్థుల డీన్ ఎం. గోవర్ధన్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 30 September, 2009
|