కండోమ్ గుర్తా? సారీ!
ఇది ఆనంద్ ప్రకాశ్ శర్మకు ఎంతో అభిమానపాత్రమైన అంశం. హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి మరింతగా చైతన్యాన్నికలిగించడానికి, సెక్స్ వర్కర్ల హక్కుల గురించి ప్రచారం చేయడానికి ఆయన గడచిన 15 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఇవే ఆయనకు ప్రధాన ప్రచారాంశాలు.
హస్తం (కాంగ్రెస్), కమలం (బిజెపి) వంటి రిజర్వుడ్ గుర్తులు కాకుండా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ వద్ద 70 స్వేచ్ఛా చిహ్నాల జాబితా ఉంది. రక్షణ కల్పించాలనే ఆలోచనకు ఇసి వ్యతిరేకం కాగదు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ కు అది గొడుగు గుర్తును కేటాయించింది. ఎవరైనా ధరించే వస్తువులను గుర్తులుగా కేటాయించడానికి కూడా అది వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఫ్రాక్, కోటు, టోపీ కూడా ఇసి గుర్తుల జాబితాలో చోటు చేసుకున్నాయి.
'ఎన్నికల అధికారులకు నచ్చజెప్పగలనని నేను మొదట భావించాను. ఏ రాజకీయ పార్టీ కూడా తన గుర్తుగా కండోమ్ ను ఉపయోగించడం లేదు కనుక దానిని నాకు కేటాయించి ఉండవచ్చు' అని శర్మ నిస్పృహతో అన్నారు. కాని ఇసి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించుకున్నది.
తాను తన లేఖ కాపీని రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపినట్లు శర్మ తెలియజేశారు. శర్మ అభ్యర్థన గురించి తమకు తెలియదని అధికారులు చెప్పారు. అయితే, వారిలో ఒకరు నవ్వుతూ 'తదుపరి రౌండ్ లో దానిని (కండోమ్ నుః) జాబితాలో చేర్చవచ్చు' అని అన్నారు.
శర్మ తన వాదనకు సమర్థనగా ఒక కోర్టు ఉత్తర్వును ఉటంకిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా లేక ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికైనా ఎటువంటి గుర్తునైనా మీరు మంజూరు చేయవచ్చునని ఎన్నికల కమిషన్ కు సుప్రీం కోర్టు ఇటీవల సూచించింది. అయితే, ఈ సూచనను కమిషన్ కు తప్పనిసరి కాదు. జాబితాలోని 70 స్వేచ్ఛా చిహ్నాలలో లేని ఇంజన్, ఈల, కొబ్బరికాయ గుర్తులను కోర్టు మహారాష్ట్రలో గుర్తింపు లేని మూడు పార్టీలకు మంజూరు చేసింది.
Pages: -1- 2 News Posted: 2 October, 2009
|