బులెట్ ప్రూఫ్ డాగ్ స్క్వాడ్
ముంబై తాజ్ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఒక ప్రైవేట్ భద్రతా సంస్థ నియమించిన డాగ్ హాండ్లర్ రవీంద్ర కుమార్, అతని స్నిఫర్ డాగ్ లూసీ ఆ రోజు హోటల్ పై టెర్రరిస్టుల దాడిలో ముందుగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 'చాలా కాలం క్రితమే జాగిలాలకు అవి (బులెట్ ప్రూఫ్ జాకెట్లు) సమకూర్చి ఉండవలసిందని నా భావన' అని ఎన్ఎస్ జి అధికారి ఒకరు చెప్పారు. 'మేము ఈ స్క్వాడ్ కోసం ప్రత్యేక జాగిలాల అంబులెన్స్ ను కూడా కొనుగోలు చేస్తున్నాం' అని ఆయన తెలిపారు. ఒక స్నిఫర్ డాగ్ కు, హాండ్లర్ కు శిక్షణ ఇవ్వడానికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు వ్యవధి పట్టుతుంది.
మధ్య ప్రదేశ్ లోని తెకాన్ పూర్ లో తమ అకాడమీలో ఒక జాగిలాల శిక్షణ పాఠశాలను నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక జాగిలం విజయవంతంగా శిక్షణను పూర్తి చేసే రేటు సుమారు 75 శాతం ఉంటుందని చెప్పారు. ప్రతి నాలుగు జాగిలాలలో ఒకదానిని ఆరోగ్యం లేదా శారీరక స్వభావం లేదా దృక్పథం కారణంగా శిక్షణలో తిరస్కరిస్తుంటారు.
'అయితే, ఒకసారి శిక్షణ పొందిన తరువాత అవి తిరుగుబాటు శక్తుల బెడద ఉన్న జమ్ము కాశ్మీర్ నుంచి నక్సల్స్ మందుపాతరలు అమర్చిన ఛత్తీస్ గఢ్ కీకారణ్యాల వరకు ప్రతి రోజు భద్రతా సిబ్బంది, పౌరుల ప్రాణాలను కాపాడగలవు' అని హోమ్ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు సూచించారు.
Pages: -1- 2 News Posted: 3 October, 2009
|