తవంగ్ పై సందర్శకుల 'దాడి'
మరి అరుణాచల ప్రదేశ్ లో ఈ ప్రాంతానికి భారతీయులు ఏ కారణంతో వస్తున్నారు? 'చైనా నుంచి తవంగ్ కు ఏవిధంగా ముప్పు ఎదురవుతున్నదో స్వయంగా తెలుసుకోవాలని మేము అనుకున్నాం' అని కోలకతాకు చెందిన పోర్ట్ ట్రస్ట్ మాజీ అధికారి లాలా సుబ్రతో డే చెప్పారు. ఆయన మిత్రుడు, ఆర్థోపెడిస్ట్ రమేందు హోమ్ చౌధురిని ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని స్వస్థలంలో అనేక మంది కోరారు. 'నేను తిరిగి రాలేకపోవచ్చునని కొందరు అన్నారు కూడా' అని ఆయన తెలిపారు. 'నేను వారి మాట విని ఉంటే, ఈ భూమి మీద అత్యంత ప్రశాంత ప్రదేశాలలో ఒకదానిని సందర్శించలేకపోయే వాడిని' అని ఆయన అన్నారు.
ఇక అగర్తలాలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో అధికారి అయిన అశోక్ కె. సామంత 1962 యుద్ధం అనంతరం చైనా ఆక్రమించిన ప్రదేశాన్ని సందర్శించాలని ఎప్పుడూ ఆకాంక్షిస్తుండేవారు. భారత-చైనా సరిహద్దులో తవంగ్ కు 41 కిలో మీటర్ల దూరంలోని బుమ్లాలో పది నిమిషాల సేపు 'చైనీస్ భూభాగాన్ని ఆక్రమించడం' ద్వారా ఆయన తన 'ప్రతీకారం' తీర్చుకున్నారు. 'సరిహద్దుకు ఆవలివైపు చైనీస్ సైనికులతో కలసి పోజు ఇస్తూ, గడిపిన ఆ పది నిమిషాలను నేను ఎన్నడూ మరచిపోలేను' అని ఆయన ఉద్విగ్నభరిత స్వరంతో చెప్పారు. బుమ్లా ఎత్తైన ప్రాంతంలో ఉన్నందున తలనొప్పి కలిగినా ఆయనకు ఈ అనుభవం 'థ్రిల్లింగ్'గా ఉంది.
కాగా, చైనా వస్తువులపై పెరిగిపోతున్న మోజును స్థానికులు స్వప్రయోజనానికి వినియోగించుకుంటున్నారు. ప్రతి మూడవ దుకాణం లేదా రెస్టారెంట్ లేదా హోటల్ కు పేరులో టిబెట్ లేదా లాసా లేదా చైనా అనే పదం చేరి ఉన్నది. చివరకు 1962 అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన తవంగ్ వార్ మెమోరియల్ భవనంలో సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సూవెనీర్ షాపు 'చైనా తయారీ' అనే ముద్ర ఉన్న వస్తువులను విక్రయిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 3 October, 2009
|