కోటీశ్వరుల పోటాపోటీ
ఈ సర్వే ప్రకారం, ప్రస్తుత శాసనసభలోని కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఉన్న, రానున్న ఎన్నికలలో తిరిగి పోటీ చేస్తున్న 31 మంది ఆస్తులు 55 రెట్లు పెరిగాయి. బల్లభ్ గఢ్ కు చెందిన శారదా రాథోడ్ 2005 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆస్తుల విలువ రూ. 81663. అవి ఇప్పుడు రూ. 45 లక్షలకు పెరిగాయి.
2005లో ఆమె తన సంపద విలువను తక్కువగా చూపించి ఉండాలి. ఏ రాజకీయ నాయకుడూ అలా చేస్తారని ఎవరూ అనుకోరు. లేదా అల్లావుద్దీన్ గుహకు చేరే మార్గం ఆమెకు తెలిసి ఉండాలి. ఒక ఎన్ జిఒను నిర్వహిస్తున్న న్యాయవాది అయిన శారదా రాథోడ్ ఆస్తుల విలువ 55 రెట్లు పెరిగిందంటే బొంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్ (బిఎస్ఇ) సెన్సిటివ్ ఇండెక్స్ కూడా దాని ముందు ఎందుకూ కొరగాదన్న మాట. ఈ ఇండెక్స్ ఈ వ్యవధిలో రెండింతలు మాత్రమే అయింది. కొందరు వ్యక్తులు, అందులోనూ సొంత పార్టీ సభ్యులు ఆర్థిక మాంద్యం సమయంలో అంత అధికంగా ఎలా ఆర్జించారో ఆర్థికవేత్త అయిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిసి ఉంటే బాగుంటుంది.
90 నియోజకవర్గాలలో ఒక్కొక్క అభ్యర్థి సగటు ఆస్తుల విలువ రూ. 5.59 కోట్లకు పైగా ఉన్న ఈ జాబితాలో కాంగ్రెస్ దే అగ్ర స్థానం కాగా ఐఎన్ఎల్ డి రూ. 3.42 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నది. హర్యానా జన్ హిత్ కాంగ్రెస్ రూ. 3.03 కోట్లతో మూడవ స్థానంలోను, బిజెపి రూ. 2.23 కోట్లతో నాలుగవ స్థానంలోను, బిఎస్ పి రూ. 2.03 కోట్లతో ఐదవ స్థానంలోను ఉన్నాయి.
Pages: -1- 2 News Posted: 5 October, 2009
|