'అధ్యక్షునితోనే ఈ అనర్థం!'
అయితే, అంతా ఈ సిద్ధాంతాన్ని విశ్వసించడం లేదు. ఎస్ బివై జన్మతేదీని చాలా మంది అదృష్ట సూచికగా పరిగణిస్తున్నారు. కాని ఇలా అతీంద్రియ శక్తుల ప్రభావమే ఈ వైపరీత్యాలంటూ మాట్లాడడం ఇండోనీసియాలో చాలా ఎక్కువగా ఉంది. ఇండోనీసియాలో హిందు మతం, బౌద్ధ మతం, సర్వాత్మవాదం వంటి పాత సిద్ధాంతాలతో ఇస్లాం, క్రైస్తవం మిళితం అవుతుండడం కనిపిస్తుంటుంది.
యుధోయునోను ఈ విమర్శలకు లక్ష్యం చేసుకోవడమనేది చాలాకాలంగా సాగుతోంది. దీనిపై ఆయన ఒకసారి స్పందించారు కూడా. రెండు సంవత్సరాల క్రితం భూకంప బాధిత పశ్చిమ సుమత్రా ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ నేతలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఇందుకు తప్పు పట్టవలసింది ఈ ప్రాంతపు భూగర్భ స్వభావాన్నే కాని తనను కాదని యుధోయునో అన్నారు.
అత్యధిక స్థాయిలో అమ్మకాలు గల ఇంగ్లీష్ దినపత్రికలో ఒకటైన 'జకార్తా పోస్ట్' కూడా ఒక ఆదివారం 'ది గాడ్స్ మస్ట్ బి ఏంగ్రీ' (దేవుళ్లు ఆగ్రహించి ఉంటారు' అనే శీర్షికతో రాసిన సంపాదకీయంలో ఈ విపత్తుకు, రాజకీయ నాయకుల దుబారా వ్యయానికి లంకె ఉందని సూచించింది. 'సైద్ధాంతిక లేదా లౌకిక వివరణను మీరు పరిగణనలోకి తీసుకున్నా, తీసుకోకపోయినా ఒకటి మాత్రం నిజం. జకార్తాలో ప్రతినిధుల సభకు, ప్రాంతీయ ప్రాతినిధ్య మండలికి కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం అనేక వందల కోట్ల రూపయ్యాలతో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను నిర్వహించనున్న సందర్భంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించి 1100 మందికి పైగా జనాన్ని బలిగొన్నది' అని పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది.
Pages: -1- 2 News Posted: 5 October, 2009
|