సిఎంఒ అత్యుత్సాహం!
మామూలుగా అనుసరించే పద్ధతి ఏమిటంటే బాంబు డిస్పోజల్ బృందం, జాగిలాల బృందం హెలికాప్టర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సురక్షిత ప్రయాణానికి సిద్ధం చేసిన తరువాత ముఖ్య భద్రత అధికారి (సిఎస్ఒ)కు తెలియజేస్తాయి. ఆతరువాత ముఖ్యమంత్రి వాహన శ్రేణి విమానాశ్రయానికి వెళుతుంది. ఆదివారం ఇలా జరగలేదు.
ఇది ఇలా ఉండగా, బ్రహ్మానందరెడ్డిని ఆయన మాతృ శాఖ రైల్వేలకు తిరిగి పంపివేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. వాస్తవానికి బ్రహ్మానందరెడ్డి ఆ సంస్థను నిర్వహిస్తున్న తీరుకు, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ సెప్టెంబర్ 2న నల్లమలలో నేలకూలిన తరువాత తలెత్తిన వివాదానికి ఆయన కేంద్ర బిందువు కావడం పట్ల ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రోశయ్య ఆదివారం బయలుదేరవలసిన సమయం వచ్చినప్పుడు బ్రహ్మానందరెడ్డితో మాట్లాడడానికి అధికారులు ప్రయత్నించారు కాని ఫలితం లేకపోయింది.
ముఖ్యమంత్రి విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.40 గంటలకు చేరుకున్నప్పటికీ హెలికాప్టర్ సిద్ధంగా లేనందున 1.40 గంటలకు గాని ఆయన బయలుదేరలేకపోయారని అధికార వర్గాలు తెలిపాయి. రెడ్డి నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ముఖ్యమంత్రి ఆయనను సస్పెండ్ చేయాలని ఆదేశించడమే కాకుండా ఆయనను మాతృ శాఖకు తిరిగి పంపివేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు రైల్వే శాఖకు లేఖ రాయాలని అధికారులను కోరారు.
ఏవియేషన్ కార్పొరేషన్ ను ఆయన నిర్వహించిన తీరు గురించి, ఆయన నిర్ణయాలలో కొన్ని వివాదాస్పదమైన తీరు గురించి కూడా రైల్వే శాఖ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ కు పైలట్ గా ఉన్న భాటియాతో బ్రహ్మానందరెడ్డి ఎప్పుడూ ఘర్షణ పడుతుండేవారు. బ్రహ్మానందరెడ్డి కార్యకలాపాలపై విచారణకు ఆదేశించవలసిందిగా కూడా రైల్వే శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ఆ వ ర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 6 October, 2009
|