చంద్రబాబు చొరవ!
వరద నష్టం తీవ్రంగా ఉందని తెలియగానే చంద్రబాబు ముఖ్యమంత్రికి, ప్రధానికి, రక్షణ శాఖ మంత్రికి, ఇతరులకు ఫోన్లు చేసి వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 'ముఖ్యమంత్రి ఎలా అయినా ప్రధానితోను, రక్షణ మంత్రితోను మాట్లాడతారు. నేను కూడా వారితో మాట్లాడడం వల్ల ఇక్కడి సమస్య తీవ్రత వారిక అవగతం అవుతుంది. దీనిని తేలికగా తీసుకోకుండా సత్వరం స్పందించేలా వారిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే నేను కూడా మాట్లాడవలసి వచ్చింది' అని చంద్రబాబు సోమవారం హైదరాబాద్ లో విలేఖరులతో చెప్పారు.
కాగా, బాధితుల సహాయార్థం విరాళాల సేకరణలో టిడిపి ఇతర పార్టీల కన్నా ముందంజ వేసింది. విరాళాల కోసం కేవలం పిలుపు ఇచ్చి ఊరుకోకుండా దాతలను గుర్తించి వారితో మాట్లాడి విరాళాల సేకరణను ప్రోత్సహించింది. దీని వల్ల ఆ పార్టీ నాయకుల నుంచి గణనీయంగానే విరాళాలు అందాయి. టిడిపి సానుభూతిపరుడు, రీజెన్సీ సెరామిక్స్ అధినేత జి.ఎన్. నాయుడు రూ. 36 లక్షల విరాళాన్ని సోమవారం ప్రకటించారు. అంతేకాకుండా బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులను ప్యాకెట్లలో పంపిణీ చేయాలని నాయుడు సంకల్పించారు.
వరద బాధిత ప్రాంతాలలో వైద్య, ఆరోగ్య సేవల నిమిత్తం పది వైద్య బృందాలను, కొన్ని మందులను కూడా చంద్రబాబు సోమవారం పంపారు. ఆయన స్వయంగా హెలికాప్టర్ లో పరిస్థితిని పరిశీలించారు. 'ఇది మన పని కాదనుకుని ఆయన ఖాళీగా కూర్చొనే మనిషి కారు. ప్రతి విషయంలోను క్రియాశీలంగా వ్యవహరిస్తారు. అది ఇందులోను కనిపించింది' అని పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 6 October, 2009
|