అక్కడ స్త్రీలదే ఆధిపత్యం
జిల్లాలో మహిళా రాజకీయ నాయకులు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. ఆలేటి అన్నపూర్ణమ్మ ఆర్మూరుకు రెండుసార్లుగా ఎంఎల్ఎగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అభ్యర్థిగా ఆమె మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) మాజీ ఎంఎల్ఎ అరుణ తారను జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబెట్టింది. కాని ఆమె ఎన్నికలలో ఓడిపోయారు. అంతకుముందు చిలివేరి లలిత, శారదా సూర్యకాంత్, గాదరి అనిత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లుగా వ్యవహరించారు.
కాగా, ఈ జిల్లాలో మహిళలు సాంప్రదాయకంగా తెలివైనవారని, కష్టించి పని చేస్తుంటారని కాకతీయ విద్యా సంస్థల చైర్ పర్సన్ సిహెచ్. విజయలక్ష్మి చెప్పారు. వారు తమ గృహస్థ జీవితానికి, ఉద్యోగానికి సమానంగా ప్రాధాన్యం ఇస్తుంటారని ఆమె తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థలను మహిళలే నడుపుతున్నారని విజయలక్ష్మి చెప్పారు.
Pages: -1- 2 News Posted: 6 October, 2009
|