కాంగ్రెస్ 'శ్వేత గజాలు'
సోనియా గాంధి ఎన్నో ఆశయాలతో ప్రారంభించిన రెండు శాఖలకు ఎం. వీరప్ప మొయిలీ, జైరామ్ రమేష్ అధిపతులు. పాలిసీ ప్లానింగ్, సమన్వయ విభాగానికి మొయిలీ అధిపతి కాగా పరిశోధన, రిఫరెన్స్ విభాగానికి జైరామ్ రమేష్ సారథి. వారిద్దరూ ఇప్పుడు కేంద్ర మంత్రులు. సోనియాకు ప్రీతిపాత్రమైన మరొక ముఖ్యవిభాగం శిక్షణ శాఖకు అధిపతిగా ఉన్న జనార్దన్ ద్వివేది మీడియా విభాగానికి, పార్టీ సంస్థాగత యంత్రాంగానికి ఇన్ చార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇక విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి కరణ్ సింగ్ తన కార్యాలయానికి ఎన్నడూ రారు. విదేశీ ప్రముఖులు సోనియాతో భేటీ అయినప్పుడు మాత్రం ఆయన అక్కడ కనిపిస్తుంటారు. ఎస్ టి విభాగం అధిపతి అజిత్ జోగి ఢిల్లీ వదలిపెట్టి రాయిపూర్ లో స్థిరపడ్డారు. ఎస్ సి విభాగం అధిపతి యోగేంద్ర మక్వానా ఏకంగా కాంగ్రెస్ పార్టీకే గుడ్ బై చెప్పారు. ఒబిసి విభాగం చైర్మన్ కె.సి. లెంకా పార్టీ ఆఫీసుకు రావడం అరుదు. ఇక కిసాన్, ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు షంషేర్ సింగ్ సుర్జేవాలా హర్యానాను శాశ్వత కేంద్రం చేసుకున్నారు. గిరిజనులు, దళితులు, రైతులు, వ్యవసాయ కూలీలలో పార్టీకి మద్దతు సమీకరించడం, అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం ఈ విభాగాల బాధ్యత. కాని ఇవి పని చేయడం అరుదు.
కంప్యూటర్ విభాగానికి విశ్వజిత్ పృథ్వీ సింగ్ అధిపతిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) వెబ్ సైట్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండడం, అందరి దృష్టినీ ఆకర్షిస్తుండడం, కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ నిస్తేజంగా ఉండడం ఈ కంప్యూటర్ విభాగం పని తీరుకు అద్దం పడుతున్నది.
పెక్కు ఇతర విభాగాల కన్నా మైనారిటీ వ్యవహారాల విభాగం మరింత చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నది. అయితే, విస్తృతంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఇది చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేకపోయింది. ఇది పార్టీ రాష్ట్ర శాఖలలో మైనారిటీ విభాగాల నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది కాని ప్రాంతీయ పార్టీల వైపు ముస్లింలు ఆకర్షితులైన రాష్ట్రాలలో వారి మద్దతును సమీకరించేందుకు ఈ విభాగం చేసిన కృషి పూజ్యం.
Pages: -1- 2 News Posted: 6 October, 2009
|