'శ్రీశైలం' దెబ్బతిందా? డ్యామ్ లో నీరు పూర్తిగా తగ్గిన తర్వాత నిర్మాణానికి నష్టం జరిగిందీ లేనిదీ తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఒకవేళ ఏదైనా నష్టం వాటిల్లిన పక్షంలో మరమ్మతులు చేయటానికి తగిన వ్యవధి కావాల్సి ఉంటుందని, అందువల్ల తక్షణమే పరిశీలించాలని అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీంతో డ్యామ్ లో నీటిని తగ్గించాలని నీటి పారుదల శాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. అయితే నీటిని తగ్గించడానికి ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉండటంతో నీటిని తగ్గించేది లేనిదీ ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అయితే డ్యామ్ కట్టడంతో పాటు గేట్లను పరిశీలించటమన్నది పూర్తిగా సాంకేతిక పరమైన అంశం కావటంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందింస్తుందని అధికారులు భావిస్తున్నారు.
డ్యామ్ ప్రధాన స్ట్రక్చర్ దెబ్బతిన్నదీ లేనిదీ తెలియాలంటే డ్యామ్ లో నీరు తగ్గితే తప్ప గుర్తించలేమని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎంకె రహ్మాన్ అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొన్నప్పటికీ డ్యామ్ కట్టడానికి ఏదైనా నష్టం జరిగిందా అని తెలుసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు సూచిస్తున్నారు. డ్యామ్ కు, గేట్లకు మధ్యలో నీటి చెమ్మ ఉండటం సహజమేనని, అయితే ఇందులో నీరు పంపింగ్ జరగటం మాత్రం ప్రమాదకరంగా భావిస్తామని అన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి పంపింగ్ ను గమనించినట్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా కూడా డ్యామ్ కట్టడానికి నష్టం జరిగిందేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Pages: -1- 2 News Posted: 8 October, 2009
|