180 దేశాల్లో భారతీయులు
చారిత్రకంగా భారత సంతతివారు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో అధిక సంఖ్యలో ఉన్నారు. తూర్పు ఆఫ్రికాలో స్థిరపడిన గుజరాతీ వ్యాపారులు కావచ్చు, ఆగ్నేయాసియాలో నివసించే తమిళ చెట్టియార్లు కావచ్చు లేదా వెస్టిండీస్ లో తోటల్లో పని చేసేందుకు బీహార్ నుంచి తీసుకువెళ్ళిన కూలీలు కావచ్చు... ఇలా భారతీయులు అనేక శతాబ్దాలుగా ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయాలలో వారు బ్రిటిష్ సైన్యం తరఫున పోరాడి యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ వలస భారతీయుల సుదీర్ఘ జాబితాలో దేశ స్వాతంత్ర్యానంతరం చేరుతున్నవారే ఎన్ఆర్ఐలు.
అయితే, ఎన్ఆర్ఐలకు అత్యంత ప్రీతిపాత్రమైన గమ్యస్థానాలు మొదటి ప్రపంచ దేశాలు లేదా ఉద్యోగావకాశాలు అపారంగా గల పశ్చిమాసియా దేశాలు. కాని ఎన్ఆర్ఐలు ఈ భూమిపై ప్రతి మూల అవకాశాలు సృష్టించుకుంటున్నారని తాజా డేటా ధ్రువీకరిస్తున్నది.
అత్యధిక సంఖ్యలో ఎన్ఆర్ఐలు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఆ దేశంలోని ఎన్ఆర్ఐల సంఖ్య 17 లక్షలు. ఆ తరువాతి స్థానాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (14 లక్షలు), యుఎస్ (9 లక్షలు) ఉన్నాయి. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమంటే అత్యల్ప సంఖ్యలోనైనా సరే స్లొవేనియా (10 మంది), మోంటెసెరాట్ (10 మంది), ఐస్ లాండ్ (21 మంది), బోస్నియా హెర్జెగొవినా (30 మంది), బుర్కినా ఫాసో (150 మంది)లలో కూడా వారు కనిపించడం.
ఇతర దేశాలలోని భారత సంతతి వారు (పిఐఒల)ను కూడా కలిపినట్లయితే తమ జనాభాకు భారతదేశంతో కల అనుబంధాన్ని కాదనడం పాకిస్తాన్, భూటాన్ లకు కూడా కష్టం కావచ్చు.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|