రొంపిలోకి రోశయ్య?
మొన్నటి, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు నెహ్రు, ఇందిరాగాంధీ చరిష్మవల్లే గెలిచారని తెలిపారు. ఈ విజయంలో 90శాతం వీరి ప్రతిభవుంటే 10శాతం వై.ఎస్. చరిష్మ ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరైనా వ్యతిరేకించగలరా అని ప్రశ్నించారు. తాను చెప్పింది కాదని ఎవరైనా చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అధిష్టాన నిర్ణయమే ఫైనల్ కాదని ఎవరైనా జడ్జిమెంట్ చెప్పగలరా అని ప్రశ్నించారు. అలా చెబితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు.
వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండు, దానికి సంబంధించిన వ్యూహాలన్నీ సిఎల్‌పి కేంద్రంగానే ఊపిరిపోసుకున్నాయన్నది తెలిసిందే. వైఎస్ మరణించిన తర్వాత జగన్‌కు సిఎం ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామంటూ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీనియర్ ఎమ్మెల్యే, రాజధాని నుంచి ముఖ్యమంత్రి రోశయ్యకు గట్టి మద్దతుదారుగా ఉన్న పి.శంకర్‌రావు సిఎల్‌పిలో ప్రెస్‌మీట్ పెట్టి.. నాలుగునెలల క్రితం నాటి ఎన్నికల విజయంలో వైఎస్ పాత్ర 10 శాతమేనంటూ చేసిన వ్యాఖ్యలు సిఎల్‌పిపై వైఎస్ వర్గం పట్టు తప్పుతోందన్న సంకేతాలిచ్చాయి.
మొత్తానికి రోశయ్య వర్గం ఒకటి చాలా వేగంగా బలపడుతుందనడానికి ఇది నిదర్శనం. రోశయ్య ప్రమేయం ఉన్నా లేకపోయినా ఈ వర్గం తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. జగన్ కోసం బలమైన వర్గం పట్టుబడుతున్న తరుణంలో తనకు ఆయాచితంగా లభిస్తున్న మద్దతును రోశయ్య కాదనలేని ఇరకాట పరిస్థితులు నెలకొన్నాయి. పీఠం ఎక్కిన తరువాత పదవీ కాంక్షతో రోశయ్యే ఈ అంతర్నాటకం ఆడిస్తున్నారనే అపోహ కూడా ప్రచారంలోకి వచ్చేసింది. ఏదైనా రాష్ట్రంలో అధికార దాహ క్రీడ మొదలైంది. ఇంతకాలం స్వార్ధరహిత రాజకీయ నేతగా అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకున్న రోశయ్య సైతం ఈ క్రీడలో పావుగా మారిపోయారు.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|