మావోలపై మహా యుద్ధం లాహిరి పోలీసు స్టేషన్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో నక్సలైట్లు సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు గాలింపు జరిపారు. దీనిలో 25 మంది సి-60 కమెండోలు, 15 మంది లాహిరి పోలీసు సిబ్బంది ఉన్నారు. గాలింపు జరిపి తిరిగివస్తున్న వీరిపైకి పోలీసు స్టేషన్ కు 15 వందల గజాల దూరంలో అడ్డగించి నక్సల్స్ కాల్పులు జరిపారని అధికారులు వివరించారు. లాహిరి నుంచి తెల్లవారుజామున 3 గంటలకు బయలు దేరాం. నక్సల్స్ బస చేశారని చెప్పిన ప్రదేశం నిర్మానుష్యంగా కనిపించింది. దాంతో వెనక్కి బయలుదేరాం. ఉదయం 10 గంటల సమయంలో ఎవరో మమ్మల్ని వెంటాడుతున్నట్లు గమనించాం. ఇంతలోనే నక్సలైట్లు మమ్మల్ని చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారని లాహిరి సబ్ ఇనస్పెక్టరు ఆజయ్ భూసారి చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లాల్ ఘఢ్ ను నక్సలైట్ల నుంచి విడిపించకోడానికి విజయవంతంగా అమలు చేసిన వ్యూహాన్నే కేంద్రం నమ్ముకుంది. నక్సలైట్ల గుప్పిటలో ఉన్న ఆరు జిల్లాలను విముక్తం చేయడానకి లాల్ ఘఢ్ తరహా దాడినే చేసి ఆ జిల్లాల్లో పౌర పరిపాలనను పునరుద్దరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆరు జిల్లాలు ఇప్పుడు నక్సలైట్ల పాలనలో ఉన్నాయి. దాదాపు 25 లక్షల మంది జనాభా ఈ ఆరు జిల్లాల్లో నక్సలైట్ల ఏలుబడిలో ఉన్నారు.
ఈ ఆరు జిల్లాల పరిధిలో 40 బెటాలియన్ల సాయుధ పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. కానీ మరిన్ని అదనపు బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయించింది. తక్కువ ప్రాంతానికి ఎక్కువ బలగాలతో దాడులు చేయడం ద్వారా నక్సలైట పీచమణచాలన్నది కేంద్రం వ్యూహం. అలా ఒక్కొక్క ప్రాంతాన్నే నక్సలైట్ల నుంచి విముక్తం చేసి, అక్కడ ఒక పోలీసు స్టేషన్ ను, పౌరసరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, మళ్ళీ సాధారణ పరిపాలన యంత్రాంగానికి ఆప్రాంతాన్ని అప్పగించడం లక్ష్యం. మొత్తం ఈ ఆరు జిల్లాలనుంచి నక్సలైట్లను తరిమి కొట్టడానకి రెండేళ్ళు వ్యవధిగా నిర్ణయించుకుంది.
Pages: -1- 2 News Posted: 10 October, 2009
|