రాణి ముందు బాలీవుడ్ నృత్యం
మంగళవారం రాత్రి 'నట్ ఖత్' బృందం ప్రదర్శించే బాలీవుడ్ నృత్యాల గురించి ఒక సంక్షిప్త సమాచార పత్రాన్ని రాణికి అందజేస్తారు. సువిశాలమైన బాల్ రూమ్ లో ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు ఇతరుల వలెనే రాణి కూడా నిలబడే ఉంటారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఇతర రాజ కుటుంబ సభ్యులలో వెస్సెక్స్ డ్యూక్, డచెస్, కెంట్ ప్రిన్స్ మైకేల్ కూడా ఉంటారు. క్రికెటర్ మాంటీ పనేశార్ తో సహా వివిధ వర్గాలకు చెందిన భారతీయులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
మాంటీ పనేశార్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో గాని, వన్ డే జట్టులో గాని సభ్యుడు కాడు. కాని ఈ కార్యక్రమానికి హాజరు కావడానికై అతను క్లబ్ గేముల కోసం తన దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మరొక మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ విక్రమ్ సోలంకి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాడు. రీటైల్ ఫ్యాషన్ రంగంలో ఖ్యాతి గడించిన వాణిజ్యవేత్త, సైంటిస్ట్ సైమన్ సింగ్ సోదరుడు టామ్ సింగ్ నుస ఫుట్ బాలర్ మైకేల్ చోప్రాను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
భారతీయ రుచులకు తగినట్లుగా ఈ రిసెప్షన్ లో వంటకాలను సిద్ధం చేస్తారు. లండన్ లో చాలాకాలం నుంచి ఉన్న భారతీయ రెస్టారెంట్లలో ఒకటైన 'వీరాస్వామి' నుంచి ఇద్దరు చెఫ్ లు వస్తారు. 'వారు ప్యాలెస్ లోని చెఫ్ లకు సాయం చేస్తారు' అని ఆ ప్రతినిధి తెలియజేశారు.
బకింగ్ హామ్ ప్యాలెస్ లో బాలీవుడ్ నృత్యాలు, రిసెప్షన్ లో సమోసాల సరఫరా అనంతరం భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రతీక మాత్రమే ఇంకా దృగ్గోచరం కావలసి ఉంటుంది. రాణి ఒక చీరను ధరిస్తే ఈ మార్పు పూర్తయినట్లు ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 13 October, 2009
|