యుపిఎకే 'మహా', హర్యానా!
కాగా పలు మీడియా గ్రూపుల కోసం ఉమ్మడిగా ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సివోటర్ సంస్థ పార్టీల వారీ గణాంకాలను సూచించలేదు. యుపిఎ 127 నుంచి 139 వరకు సీట్లు గెలుచుకోగలదని, ఎన్ డిఎకు 106 నుంచి 118 వరకు సీట్లు రాగలవని ఈ సంస్థ సూచించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం ఎంఎన్ఎస్ కు 9, 17 మధ్య, ఇతరులకు 24, 36 మధ్య సీట్లు దక్కవచ్చు.
ఈ జోస్యాలే కనుక నిజమైన పక్షంలో కాంగ్రెస్ - ఎన్ సిపి కూటమి మహారాష్ట్రలో రాజకీయంగా ఒక అపూర్వ ఘనతనే సాధించనున్నదన్న మాట. రాష్ట్రంలో పాలన ఏమాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేకపోయినప్పటికీ ఈ కూటమి మూడవ దఫా అధికారంలోకి రానున్నదన్న మాట. బిజెపి - సేన కూటమి ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోలేకపోయిందనడానికి ఈ ఫలితం సూచిక కానున్నది.
హర్యానాలో 90 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 57 సీట్లు లభించగలవని స్టార్ న్యూస్ సూచించింది. సివోటర్ పోల్ ప్రకారం ఈ పార్టీకి 57, 65 మధ్య సీట్లు రావచ్చు. ఈ రెండు పోల్స్ ప్రకారం, ఐఎన్ఎల్ డి ప్రతిపక్ష స్థానాలలో కూర్చొనవలసిన పరిస్థితి కనిపిస్తున్నది. స్టార్ న్యూస్ పోల్ ఈ పార్టీకి 18 సీట్లు రావచ్చునని సూచిస్తుండగా సివోటర్ పోల్ ప్రకారం 13, 19 మధ్య సీట్లు రావచ్చు. ఇక భజన్ లాల్ పార్టీకి 9 సీట్లు వస్తాయని స్టార్ న్యూస్, 2 నుంచి 6 వరకు సీట్లు రావచ్చునని సివోటర్ సంస్థ సూచించాయి.
ఈ రెండు పోల్స్ ప్రకారం, హర్యానాపై తన ఆశలను నిజం చేసుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) మరికొంత కాలం వేచి ఉండవలసి రావచ్చు. ఈ పార్టీకి కేవలం రెండు సీట్లు వస్తాయని స్టార్ న్యూస్ సూచించగా సివోటర్ పోల్ ప్రకారం ఈ పార్టీకి ఒకటి నుంచి ఐదు వరకు సీట్లు రావచ్చు. ఇతరులకు మూడు సీట్లు లభిస్తాయని స్టార్ న్యూస్, రెండు నుంచి ఏడు వరకు సీట్లు వస్తాయని సివోటర్ సూచించాయి.
Pages: -1- 2 News Posted: 14 October, 2009
|