ఇక్కడ దీపావళి పక్షులకే!
ఈ ప్రాంతంలోని దుకాణాలలో కూడా బాణసంచా నిల్వ చేయరు. ఏ ఏడాదికాయేడాది ఈ ప్రాంతంలో తమ ఉత్పత్తుల విక్రయానికి శివకాశి ఫ్యాక్టరీలు విఫలయత్నం చేస్తున్నాయి. జనం కొత్త దుస్తులు ధరించి, మిఠాయిలు పంచుకుని, వీలైతే అభయారణ్యాన్ని సందర్శించి పండుగను జరుపుకుంటుంటారు. 'ఇక్కడ మనకు కనిపించే రంగురంగుల ముందు ఏ బాణసంచా అయినా దిగతుడుపే' అని హైస్కూలు విద్యార్థినులు ఎం. మీనాకుమారి, ఆర్. సుమతి వ్యాఖ్యానించారు.
చివరకు పిల్లలు కూడా టపాసుల కోసం తమ తల్లిదండ్రుల వెంట పడి వేధించరని మరొక గ్రామస్థురాలు పి. స్వర్ణవల్లి చెప్పారు. 'గూళ్ళలో ఉండే పక్షి పిల్లలు ఎలా బెదరిపోతుంటాయో, అవి ఎలా షాకుతో చనిపోతాయో పిల్లలతో మేము చెబుతుంటాం. వారు కూడా బాణసంచా కావాలని అడగరు' అని ఆమె తెలిపారు.
వలస వచ్చే పక్షులను సందర్శకులు చూసేందుకు వీలుగా గ్రామస్థులు 40 అడుగుల ఎత్తులో 'వాచ్ టవర్'లు ఏర్పాటు చేశారు. వినోద యాత్రా కేంద్రంగా వెడంకుడిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకై ప్రభుత్వం రోడ్లతో సహా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నది. అయితే, అభయారణ్యంలో ఏడాది పొడుగునా నీరు ఉండే విధంగా రిజర్వాయర్ లో పూడిక తీసివేయడం, లోతు పెంచడం తక్షణావశ్యకమని గ్రామస్థులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం రిజర్వాయర్ దాదాపుగా ఎండిపోయింది. పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 'తగినంత నీరు ఉంటేనే పక్షులు తమ పిల్లలతో పాటు తమ ప్రాంతాలకు ఎగురుకుంటూ తిరిగి వెళ్ళగలవు' అని కాలేజి విద్యార్థి ఆర్. కుమారస్వామి అన్నాడు.
తమ శాఖ ఇప్పుడు పక్షులపై డేటా సేకరిస్తున్నదని డిఎఫ్ఒ గుప్తా తెలియజేశారు. 'ఈ పక్షులు మామూలు పొద చెట్లను ఇష్టపడవు. మేము వీటిని తొలగించి అమ్మగా వచ్చిన డబ్బును గ్రామ అటవీ మండలికి అందజేస్తాం. వారు దానిని తమ గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారు' అని గుప్తా తెలిపారు.
Pages: -1- 2 News Posted: 15 October, 2009
|