క్లైమేట్ మార్పుతో అనర్థమే
పర్యావరణ మార్పులపై పరిశోధన నిర్వహించడానికి, రైతులకు పరిష్కారాలను సూచించడానికి 127 విద్యా సంస్థలతో ఒక జాతీయ నెట్ వర్క్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జైరామ్ రమేష్ వెల్లడించారు. 'మనం ఇప్పటికే ఆలస్యం చేశాం. చర్య తీసుకోవడానికి ఇదే సరైన తరుణం' అని ఆయన పేర్కొన్నారు.
2000 సంవత్సరంలో 75 మిలియన్ టన్నులుగా ఉన్న గోధుమల ఉత్పత్తి 2020లో 72 మిలియన్ టన్నులకు, 2080 నాటికి 54 మిలియన్ టన్నులకు తగ్గిపోతుందని ఒక అధ్యయనం సూచిస్తున్నది. కాని కొత్త పంట రకాలను ఉపయోగించినట్లయితే, ఈ ఉత్పత్తి 22020 నాటికి 76 మిలియన్ టన్నులకు పెరగవచ్చునని ఇది సూచిస్తున్నది.
హిమాచల్ ఆపిల్ ఉత్పత్తికి సంబంధించిన ఒక డేటా ప్రకారం, శీతాకాలాలలో ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఒక్కొక్క చెట్టుకు ఉత్పత్తి స్థాయి 1980లోని 7 టన్నుల నుంచి 2001లో దాదాపు రెండు టన్నులకు పడిపోయింది. అదేవిధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత బాస్మతి బియ్యం నాణ్యత తగ్గిపోవడానికి కారణమైంది.
అయితే, వాతావరణ మార్పు వల్ల పశ్చిమ కోస్తాలో శనగలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, సజ్జలు వంటి పంటలు, ఈశాన్య భారతంలో బంగాళాదుంపలు, ఆవాల పంటల దిగుబడి మెరుగు కావచ్చునని ఈ అధ్యయనం సూచిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 15 October, 2009
|