వైఎస్ పథకాలే శ్రీరామరక్ష రాష్ట్రావసరాలకు 55 వేల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం అవసరం కాగా కేంద్రం ఈ కోటాను పట్టుబట్టి సాధించాల్సిం దేనని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం అదనపు కోటాపై చేతులెత్తేసే పరిస్థితిలో ఉంది. ఇదే బియ్యాన్ని బయట కొంటే రాష్ట్రానికి రూ.350 కోట్లు ఖర్చవుతుందని కేబినెట్‌లో చర్చించారు. బియ్యం బదులు గోధుమలు ఇవ్వాలనుకున్నా ఈ నెల నుంచి గోధుమల రేట్లు కూడా కిలోకు రూ.1.25 చొప్పున పెరుగుతున్నాయని కొందరు మంత్రులు ప్రస్తావించారు. బిటి వంకాయ సాగుకు రాష్ట్రంలో అనుమతిపై వ్యవసాయ మంత్రి రఘువీరాను అడిగి తెలుసుకున్నారు. దీని సాధ్యాసాధ్యాల కోసం కమిటీ ఏర్పాటు చేసి సరైన నివేదికను అందిస్తామని ఆయన తెలిపినట్లు సమాచారం.
సంక్షోభ సమయంలో విద్యుత్ అమ్మకంపై వెలువరించిన ఉత్తర్వులు ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తాయని పలువురు మంత్రులు కేబినెట్‌లో ప్రస్తావించారు. దీనిపై సీఎం రోశయ్య స్పందిస్తూ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే, సామాన్య ప్రజలపై బిల్లుల భారం తగ్గించాలంటే ప్రైవేటు విద్యుత్‌లో 20 శాతం అమ్మకాలు తప్పవని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఇది వైఎస్ గత ఏడాదిలోనే ఆలోచించిన తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నట్లుగా ఆయన మంత్రివర్గ సహచరు లకు చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ జీఓ అమలు చేయ కున్నా కాలానుగుణంగా అమలు చేయాలని నిర్ణయించారు.తెలంగాణ ప్రాంతాల్లో డెంగ్యూ వల్ల చాలామంది చనిపోతు న్నారని, దీనిపై మంత్రులు దానం, పితాని, సుదర్శన్ రెడ్డిలు అప్రమత్తమై వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని వెంటనే కదిలించాలని సీఎం రోశయ్య సూచనలు చేశారు. స్వైన్ ఫ్లూ మళ్లీ తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు.
Pages: -1- 2 News Posted: 15 October, 2009
|