దీదీ వెంట దాదా!
వివిధ రంగాలలోని ప్రముఖులను తన రైల్వే ఛత్రం కిందకు తీసుకువచ్చి, బెంగాల్ లో తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలకు వారి మద్దతు సమీకరించడానికి మమత ఈమధ్య కాలంలో గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ గత ఆగస్టులో గరియాకు విస్తరించిన మెట్రో రైల్వే సర్వీసు ప్రారంభోత్సవం. బెంగాలీ చిత్రపరిశ్రమ ప్రముఖులు దాదాపు అందరినీ ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యేట్లు చేయగలిగారు.
కాగా, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు స్వర్గీయ సినీ దర్శకుడు సత్యజిత్ రే పేరు పెడతారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వ్యక్తులలో సినీ, క్రీడా రంగాలకు చెందినవారు ఉన్నారు. వారిలో సత్యజిత్ రే కుమారుడు సందీప్, అతని భార్య కూడా ఉన్నారు.
115 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు ఉండే ఇన్ డోర్ స్టేడియంలో 5000 మంది వీక్షకులు కూర్చొనవచ్చు. బాస్కెట్ బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, కుస్తీ వంటి క్రీడలకు ఈ స్టేడియంలో సదుపాయాలు ఉంటాయి.
Pages: -1- 2 News Posted: 16 October, 2009
|