సంఘ్ కౌగిల్లోకి బీజేపీ అయితే ఈ సీనియర్లలో ఎవర్ని నియమించినా తెరవెనుక బాగోతం మళ్ళీ అద్వానీయే నడుపుతారన్నది సంఘ్ పెద్దల అభిప్రాయం. అయినా సంఘ్ ఆలోచన్లకు పరిమితులు ఉన్నాయని, ఏదైనా నాయకత్వ మార్పులో అద్వానీ మాటదే పై చేయి అవుతుందని బీజేపీ నాయకత్వం చెబుతోంది. సహజంగా ప్రచారానికి దూరంగా ఉండే పరికార్ సెప్టెంబర్ నెల్లో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి వివాదం ఊబిలో కూరుకుపోయారు. సొంత పార్టీ నాయకుడ్ని గౌరవించకుండా చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయి. అసలు అద్వానీ గౌరవప్రదంగా తప్పుకోవడమే ఉత్తమమని సంఘ్ అభిప్రాయం. వివాదాల అగౌరవంలో అద్వానీ కూరుకుపోకుండా తప్పుకోవాలని వారు చెబుతున్నారు. జాతీయ పార్టీకి అధ్యక్ష పదవి రేసులో ఉన్న పరికార్ సీనియర్లను కల్లో కూడా అగౌరవించ కూడదన్నది సంఘ్ నిశ్చితాభిప్రాయం.
ఇక మహారాష్ట్ర శాసనమండలి బీజేపీ నాయకుడు గడ్కారీకి కూడా చాలా బలహీన లక్షణాలున్నాయి. పార్టీలోనే ఆయనకి అంతర్గత వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన స్వర్గీయ ప్రమోద్ మహాజన్ తో విభేదించేవారు. ఇప్పుడు ఆయన బావమరిది గోపీనాథ్ ముండేతో వివాదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ గడ్కారీ అవకాశాలు మరీ సన్నగిల్లి పోలేదని తాజా ఎన్నికల ఫలితాలు ఆయన భవితవ్యాన్ని నిర్దేశిస్తాయని ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి విజయం సాధిస్తే గడ్కారీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే భావించవచ్చని అంటున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ప్రస్తుత ముఖ్యమంత్రుల నుంచి ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తున్నప్పటికీ సంఘ్ మదిలో అలాంటి ఆలోచనలేవీ లేవని వివరిస్తున్నారు. నరేంద్రమోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణసింగ్ లు ముఖ్యమంత్రి పదవిని వదిలి, ముళ్ళ కిరీటం లాంటి బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా గానీ సంఘ్ అధినేత భగవత్ మాత్రం యువకులవైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 16 October, 2009
|