ఎవరీ రవిశర్మ? ఆ సమయంలోనే సిండికేట్ బ్యాంక్ లోఅధికారిగా పనిచేస్తున్న అనూరాధతో ప్రేమలో పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అనూరాధ కూడా మావోయిస్టు భావజాలం పట్ల ఆకర్షితురాలైన యువతి కావడంతో పీపుల్స్ వార్ కు అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్యలో చేరి చాలా త్వరగానే ఆమె దానికి అధ్యక్షురాలైయ్యారు. వీరి ప్రేమకు కులాల పేరుతో పెద్దలు అనుమతి ఇవ్వకపోవడంతో పీపుల్స్ వార్ నాయకుల సమక్షంలో 1991లో వివాహం చేసుకున్నారు. శర్మను వివాహంచేసుకున్న తర్వాత అనూరాధ కూడా సాయుధ పోరాటంలోకి ప్రవేశించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ ఇద్దరూ అనేక ఆపరేషన్లను నిర్వహించారు. ఆ తరువాత బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారు. సభ్యులకు ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ఇవ్వడంలో ఇద్దరూ సిద్ధహస్తులేనని పోలీసులు చెబుతున్నారు.
ఆంధ్రా పోలీసులు వెంటపడుతూ ఉండండతో ఈ దంపతులు ఉత్తర భారత దేశానికి తరలిపోయారు. 1992లో శర్మ ఢిల్లీలోని పూసా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పీహెచ్ డీ చేయడానికి పేరును నమోదు చేయించుకున్నాడు. ఇక్కడ పోలీసులు శర్మ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని భావించారు. పోలీసు రికార్డుల్లో ఉండగానే శర్మ చాలా ధైర్యంగా ఢిల్లీ యూనివర్శిటీలో డాక్టరేట్ కోసం పేరు నమోదు చేయించుకోవడం విశేషం. నాలుగు నెలలు శర్మ అక్కడ చదువుకున్నాడు. కానీ ఆంధ్రా పోలీసులకు ఉప్పందడంతో అప్పుడు ఈ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏకే 47 లాంటి ఆధునిక ఆయుధాలు ఎలా ఉపయోగించాలో వివరిస్తూ శర్మ మ్యాన్యువల్స్ రచించారు. దీనిని హిందీ, తెలుగు, బెంగాలీ, ఒరియా భాషల్లోకి అనువదించారు. ఢిల్లీ వదిలిన తర్వాత శర్మ బీహార్-జార్ఖండ్ ప్రత్యేక ప్రాంతీయ కమిటీకి మావోయిస్టు సాయుధ వ్యవహారాలకు చీఫ్ గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులను, ప్రభుత్వ అధికారులను హతమార్చడంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అన్ని ఆపరేషన్ లలోనూ అనూరాధ శర్మకు తోడుగా, నీడగా ఉండేదని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో ఆమె బీహార్-జార్ఖండ్ రాష్ట్రాల నారీ ముక్తి సంఘటనకు నాయకత్వం వహించేవారని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తూ ఉద్యమంలోకి మహిళలను ఆకర్షించడంలో అనూరాధ కీలక పాత్ర పోషించారని అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 16 October, 2009
|