కంపెనీ మెడికల్ కాలేజీలు! దేశంలో ప్రస్తుతం 300 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం, ట్రస్ట్, సొసైటీల యాజమాన్యాల కింద నడుస్తున్నాయి. ఈ కాలేజీల నుంచి ఏటా 23 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు. మెడికల్ కాలేజీస్ రెగ్యులేషన్ చట్టం (1990)కు అవసరమైన సవరణలు చేయడం ద్వారా గ్రేడ్ ఎ సిటీలలో కేవలం పది ఎకరాల విస్తీర్ణంలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. అయితే భూ విస్తీర్ణాన్ని 25 నుంచి 10 ఎకరాలకు తగ్గిస్తున్నందున కాలేజీ కోసం హై రైజ్ భవనాలను నిర్మించాల్సి ఉంటుంది.
కాలేజీ, హాస్పిటల్, హాస్టల్స్, లాబ్స్, లైబ్రరీ తదితరమైన ప్రధాన మౌలిక సదుపాయాలన్నీ ఈ హై రైజ్ భవనాలలోనే కల్పించాల్సి ఉంటుందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ కేతన్ దేశాయ్ వెల్లడించారు. దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్నందున పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. పెరుగుతున్న దేశ జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ప్రతి ఏడాది దేశానికి 50 వేల మంది కొత్త డాక్టర్ల అవసరం ఉన్నట్లు గ్లోబల్ హెల్త్ చైర్న్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 18 October, 2009
|