శివకాశిలో డైరీల 'బూమ్'
  
దక్షిణ తమిళనాడులోని ఈ ఉష్ణ ప్రాంతంలో 1922లో తొలి ప్రింటింగ్ ప్రెస్ ను ఏర్పాటు చేశారు. అగ్గిపెట్టెలు, బాణసంచాలకు లేబుల్స్ ముద్రణ కోసం ఒక అనుబంధ సంస్థగా దానిని ప్రారంభించారు. అటువంటి శివకాశి ఇప్పుడు రూ. 2000 కోట్ల వార్షిక టర్నోవర్ తో ప్రింటింగ్ రంగంలో దేశంలోనే అతి పెద్ద  పట్టణంగా విలసిల్లుతోంది. 
 
ఆర్ట్ వర్క్ నుంచి అత్యాధునిక ఆఫ్ సెట్ ప్రింటింగ్ నుంచి బైండింగ్ వరకు అన్ని ముద్రణావసరాలను ఒకే చోట తీర్చే కేంద్రంగా శివకాశి పరిఢవిల్లుతున్నది. క్యాలెండర్లు, డైరీలు, పుస్తకాలు, నోటుపుస్తకాలు, నోటుపుస్తకాల అట్టలు, లేబుళ్ళు, కార్టన్లు, పెళ్ళి శుభలేఖలు, విద్యార్థుల చార్ట్ లు మొదలైనవాటిని శివకాశిలో ముద్రిస్తున్నారు. 
 
'కొత్త మెషీన్లు, కంప్యూటర్లు, స్కానర్లు, ఫోటోషాపు ఆవిర్భావంతో ముద్రణ రంగం విస్తరించి ప్రతి పెద్ద నగరం సొంతంగా ప్రింటింగ్ కేంద్రాన్ని వృద్ధి చేసుకుంటున్నది' అని ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి. మురళీధరన్ చెప్పారు. 'ఉదాహరణకు తిరుపూరు హొజైరీ రాజధానిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నప్పుడు ఆ పట్టణ ఎగుమతి అవసరాలు తీర్చడానికి అక్కడ కొన్ని ప్రింటింగ్ ప్రెస్ లు ఏర్పాటయ్యాయి. అంతకుముందు అటువంటి ఆర్డర్లు శివకాశికి వస్తుండేవి' అని మురళీధరన్ వివరించారు. 
 
ఉత్తరాదిలోని పరిశ్రమలు  కూడా శివకాశిలోని ప్రెస్ లకు బదులు లూధియానా, ఢిల్లీ, చండీగఢ్ లలోని ప్రింటర్లకు ఆర్డర్లు ఇచ్చి రవాణా ఖర్చులు ఆదా చేస్తున్నాయని ఆయన తెలిపారు. చివరకు ఎన్నికల పోస్టర్ల స్థానంలో కూడా చిన్న పట్టణాలలోనే స్థానికంగా చౌకయైన ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటవుతున్నాయని ఆయన చెప్పారు. 
 
అయితే, అధిక పరిమాణంలో, అత్యంత వేగంగా ముద్రణ కావాలంటే మాత్రం శివకాశినే ఇప్పటికీ కోరుకుంటుంటారు. ఉదాహరణకు, దేశంలో విక్రయించే లేదా పంపిణీ చేసే క్యాలెండర్లలో దాదాపు 50 శాతం శివకాశిలోనే ప్రింట్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు ఆర్డర్లు నవంబర్ వరకు వస్తుంటాయి.
 
  
Pages:   -1-   2        News Posted: 19 October, 2009    
    
  |