జగన్ కు సెంటర్ ఆఫర్! అయితే, కేంద్రంలో సహాయ మంత్రి పదవిని తీసుకొనేందుకు జగన్ వర్గం ఇప్పటికే విముఖతను వ్యక్తం చేసినందున ఆయనను సంతృప్తిపరచడం కోసం సహాయ మంత్రి హోదాలోనే ఏదైనా ఒక మంత్రిత్వశాఖను స్వతంత్రంగా నిర్వహించే అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ఎఐసిసి ఆఫీస్ బేరర్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా స్వల్ప మార్పులు చేర్పులు చేయడం తధ్యమని, మంత్రివర్గ విస్తరణలో సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్‌సభ స్పీకర్ పదవికి పరిశీలించిన సీనియర్ నాయకుడు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వైరిచర్ల కిశోర్‌చంద్ర దేవ్‌తో పాటు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి స్థానం కల్పించే విషయాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని ఎఐసిసి నాయకుడొకరు తెలియజేశారు.
కిశోర్‌చంద్ర దేవ్‌కు క్యాబినెట్ మంత్రి హోదా, జగన్‌కు సహాయ మంత్రి పదవులను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ వర్గంగా వ్యవహరిస్తున్న శాసనసభ్యులు, నాయకులంతా ముఖ్యమంత్రి రోశయ్య నాయకత్వాన్ని అంగీకరించే షరతుపైనే జగన్‌కు కేంద్రంలో మంత్రి పదవి లభించనున్నదని కూడా ఆ నాయకుడు స్పష్టం చేశారు. జగన్‌కు ఇండిపెండెంట్ చార్జితో కూడిన సహాయ మంత్రి పదవిని అప్పగించడం కోసం ప్రస్తుతం ఇండిపెండెంట్ చార్జి మంత్రులుగా ఉన్న శ్రీప్రకాశ్ జైస్వాల్, జి.కె.వాసన్, జైరాం రమేష్‌లలో ఒకరికి స్థాన చలనం తప్పకపోవచ్చు.
Pages: -1- 2 News Posted: 19 October, 2009
|