'క్రైమ్ కథనాలే నాకు స్ఫూర్తి' అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. ఆ రోజు రాత్రి, చంద్రశేఖర్ కు భార్య అనూష గ్లాసుడు పాలు తాగేందుకు ఇచ్చింది. అందులో నిద్రమాత్రలు కలిపిన విషయం తెలియని చంద్రశేఖర్... ఆ పాలను తాగేశాడు! మత్తులోకి చంద్రశేఖర్ చేరాడు. ఈలోగా మొబైల్ ఫోన్ ద్వారా నవీన్ ను ఆళ్ళగడ్డ రప్పించింది. చంద్రశేఖర్ కాళ్ళు, చేతులు తాళ్ళతో కట్టేశారు. అతని ముఖాన్ని అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. తరువాత చంద్రశేఖర్ శవాన్ని స్కూటీ పై తీసుకుపోయి కార్వాన్ వద్ద పారేశారు. అనంతరం ఇంటిని నీళ్ళతో కడిగి శుభ్రం చేశారు. తెల్లవారిన తరువాత 7 గంటల వరకు నవీన్... తన స్నేహితురాలు అనూష ఇంటివద్దే ఉన్నాడు.
చంద్రశేఖర్ కథ ముగించిన అనూష... తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చూపిన 'గుర్తు తెలియని శవాన్ని' అనూష గుర్తించింది! దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తీగలాగారు. డొంక కదిలింది. అనూష మొబైల్ ఫోన్ ఆధారంగా నిందితుల్ని పట్టేశారు. నేరాన్ని అంగీకరించిన నవీన్.... టీవీ ప్రోగ్రామ్ ల సాయంతోనే ఈ హత్యకు పథక రచన చేశానని చెప్పాడు. చివరి వరకు ఆ... టీవీ కార్యక్రమాలను చూడలేదా... అని పీసీసీ రవి వర్మ ప్రశ్నించగా, చూడలేదని నిందితుడు బదులిచ్చాడు! చివర వరకు కార్యక్రమం చూసిన పక్షంలో పోలీసులకు హంతకులు పట్టుబడతారన్న విషయం నీకు తెలిసేదని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 20 October, 2009
|