ఐఐటికి కొత్త అర్హత!
కొత్త కమిటీకి సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శి, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి, వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ సమష్టిగా సారథ్యం వహిస్తారు. కమిటీ మూడు నెలలలోగా తన నివేదికను సిద్ధం చేయవలసి ఉంటుంది. కాగా, ఐఐటిల భవితకు సంబంధించి ఒక పథకం రూపొందించేందుకై భారత అణు ఇంధన కమిషన్ (ఎఇసి) అధిపతి అనిల్ కాకోద్కర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని కూడా ఐఐటి కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన ముసాయిదా నివేదికను ఆరు నెలలలోగా సమర్పించవలసి ఉంటుంది. దేశం పట్ల ఈ ఇన్ స్టిట్యూట్లకు గల బాధ్యతలను ఈ కమిటీ పునర్నర్వచించి, ప్రైవేట్ రంగంతో ఇతోధిక సమన్వయంతో వ్యవహరించేందుకు విధానాలను సూచిస్తుంది.
'ఐఐటిలకు దేశనిర్మాణంలో పాత్ర ఉన్న, ప్రైవేట్ రంగానికి ప్రవేశం అనుమతించని పరిశోధన, అకడమిక్ రంగాలు ఉన్నాయి. అయితే, మరింత సమన్వయం కావలసిన ఇతర రంగాలు కూడా ఉన్నాయి' అని సిబల్ చెప్పారు. ఐఐఎంల వలె ఐఐటిలు ప్రభుత్వం నుంచి త్వరలో ఆర్థిక స్వాతంత్ర్యం త్వరలో పొందగలుగుతాయని తాను భావించడం లేదని సిబల్ చెప్పారు.
కాగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలోకి విదేశీ విద్యార్థుల ప్రవేశానికి నిబంధనలను సడలించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది. ఈ ఇన్ స్టిట్యూట్ లు ఇక అడ్మిషన్ నిబంధనలను సిఫార్సు చేయగలవని భావిస్తున్నారు. ఒక నిర్దుష్ట ఇన్ స్టిట్యూట్ లో గల విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికగా ఇన్ స్టిట్యూట్ లకు ప్రభుత్వ నిధులను గణనీయంగా మంజూరు చేయాలని కూడా ఐఐటి కౌన్సిల్ నిర్ణయించింది. ప్రణాళికేతర నిధులు అంటే పంచవర్ష ప్రణాళిక కింద కేటాయించిన ఆర్థిక నిధులకు మించి చేసే బడ్జెట్ కేటాయింపులకు ఇది వర్తిస్తుంది. తమ తమ సంస్థలలో విద్యార్థులను చేర్చుకోవడంలో భారీగా అంతరం ఉంటున్నప్పటికీ ఐఐటిలకు ప్రస్తుతం ఒకే రీతిలో ప్రణాళికేతర నిధులు అందుతున్నాయి.
ఫ్యాకల్టీ కోరిన, ప్రభుత్వం అంగీకరించిన పని తీరు సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం తమ ప్రతిపాదనలను ఐఐటి డైరెక్టర్లు ఇంకా సమర్పించవలసి ఉందని సిబల్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 20 October, 2009
|