వైఎస్- మేడిన్ చైనా! చైనా బోమ్మల తయారుదారులు ఇక్కడి వ్యాపారులు ఇచ్చే ఆర్డర్లను బట్టి బొమ్మలను తయారు చేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారులు కూడా ఈ యాభై రోజుల్లో కనీసం ఆరేడు లక్షల రూపాయల లాభాలను ఆర్జించారని విజయవాడకు చెందిన బొమ్మల వ్యాపారి తెలిపారు. ఇంతవరకూ ఒక రాజకీయ నాయకుని బొమ్మతో ఇంత వ్యాపారం జరగడం తాను చూడలేదని మోహన్ రెడ్డి అనే వ్యాపారి వివరించాడు. వ్యాపారులు వైఎస్ బొమ్మను, ఆర్డరును ఈ మెయిల్ పంపితే చాలు. చైనా వ్యాపారులు వెంటనే బొమ్మలు పంపుతున్నారని విశదీకరించాడు. వేదిక మీద నిలబడిన ఫోజులో వైఎస్ బొమ్మ ఎప్పడూ ఎడమ చేయి ఊపుతూ ఉండే బొమ్మను 150 రూపాయలకు వ్యాపారులు అమ్ముతున్నారు. ఇది 70 రూపాయలకే దిగుమతి అవుతోంది.
ఈ వ్యాపారంలోకి ఢిల్లీ కి చెందిన బొమ్మల తయారీదారులు కూడా ప్రవేశించారు. వీరు ప్లాస్టిక్ తోనూ, చెక్కతోను బొమ్మలు తయారు చేస్తున్నారు. రాజస్థాన్ హస్తకళల నిపుణులతో కొయ్యబొమ్మలను తయారు చేయించి వారు సరఫరా చేస్తున్నారని వ్యాపారులు చెప్పారు.
ఇదిలా ఉంటే వైఎస్ నిలవెత్తు విగ్రహాలకు కూడా గిరాకీ విపరీతంగా ఉంది. రాష్ట్రంలోని గ్రామగ్రామల్లోని నాయకులు కూడా వైఎస్ కాంస్య, సిమెంటు విగ్రహాలకు పెద్దయెత్తున ఆర్డర్లు ఇస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 21 October, 2009
|