'శీఘ్రం'తో సిరి జల్లు
మొదటి రోజు మొదటి ఐదు గంటలలో 6000 మందికి పైగా యాత్రికులు ఈ దర్శన సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు టిటిడి వర్గాలు వెల్లడించాయి. రాత్రి 11 గంటలకు దర్శన సమయం ముగిసేసరికి ఈ సంఖ్య 10 వేలు దాటవచ్చునని ఆ వర్గాలు సూచించాయి. 'కొంత మంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినప్పటికీ యాత్రికులలో అత్యధిక సంఖ్యాకులు ఈ విధానాన్ని కొనియాడారు' అని టిటిడి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం 'మహా లఘు దర్శనం' (60 అడుగుల దూరం నుంచి శ్రీవారి దర్శనం) విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా టిటిడి విమర్శలకు గురైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు. 'కాని ఇప్పుడు అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు అందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు' అని ఆ అధికారి చెప్పారు.
తన కుటుంబంతో కలసి చెన్నై నుంచి వచ్చిన 70 ఏళ్ళకు పైగా వయస్సున్న ఆర్.ఎస్. మణి ఈ కొత్త విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 'చాలా కాలం తరువాత మాకు ఏజెంట్ల బెడద లేకుండా హాయిగా స్వామివారి దర్శనం అయింది. టిటిడి మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయగలదని ఆశిస్తున్నాం' అని ఆయన చెప్పారు. ఈ విషయమై మీడియా ప్రశ్నించినప్పుడు టిటిడి చైర్మన్ సమాధానం ఇస్తూ, 'క్యూలో నిరీక్షణ వ్యవధిని తగ్గించడంపైనే మేము దృష్టి కేంద్రీకరిస్తున్నాం. కౌంటర్లు, టిక్కెట్ ధరపై తరువాత తప్పకుండా పునరాలోచన ఉంటుంది' అని చెప్పారు.
Pages: -1- 2 News Posted: 22 October, 2009
|