ఆ టీచర్ 'సీరియల్ కిల్లర్'
మోహన్ తాను చేస్తున్నదేమిటో స్పష్టంగా తెలిసిన వ్యక్తి అని ఐజిపి (పశ్చిమ మండలం) గోపాల్ హోసూర్ చెప్పారు. (గోపాల్ హోసూర్ 1985లో డిఎస్ పిగా ఉన్న సమయంలో అప్పటి ఘరానా 'సీరియల్ కిల్లర్' వడ్డర శంకప్పను పట్టుకున్నారు.) తాను హత్య చేయాలనుకున్న యువతులు ఒక్కొక్కరి గురించి రెండు నెలల పాటు 'సమాచారం సేకరించడం, వారిని ప్రలోభానికి గురి చేయడం', తదుపరి మరొకరి కోసం అన్వేషించడం మోహన్ లక్ష్యమని గోపాల్ హోసూర్ చెప్పారు. ఆ యువతులతో మోహన్ వ్యవహారాల వివరాలన్నిటినీ సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.
బాధితుల కుటుంబ సభ్యులతో నేరుగా సంబంధం లేకపోవడం వల్ల నిందితుని ఆ కేసులలో దేనిలోనూ ఎన్నడూ అనుమానించలేదని ఆయన తెలిపారు. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులకు పుత్తూరులో నిందితునికి సైనైడ్ అందజేసిన వ్యక్తి గురించి తెలియవచ్చిందని ఐజిపి చెప్పారు. ఆ వ్యక్తిని నేరానికి ప్రోత్సాహకునిగా పరిగణించనున్నట్లు ఆయన చెప్పారు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడమే అతనిని వారికి చేరువ చేసి ప్రాణాంతకం చేసిందని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు 8 సైనైడ్ మాత్రలను, నాలుగు మొబైల్ ఫోన్లను, అనితకు చెందిన నగలను స్వాధీనం చేసుకున్నారు. బంట్వాల్ లో మోహన్ కుమార్ పై ఒక అత్యాచారం, హత్య కేసును నమోదు చేసినట్లు హోసూర్ తెలియజేశారు. కొత్త సాక్ష్యాధారాల దృష్ట్యా అతనిపై మిగిలిన 17 కేసులను తిరగదోడి దర్యాప్తు జరపనున్నట్లు ఆయన తెలిపారు. డిజిపి అజయ్ కుమార్ సింగ్ ఈసారి మంగళూరు నగరానికి వచ్చినప్పుడు సిట్ సిబ్బందికి పురస్కారం ఇవ్వగలరని హోసూర్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 22 October, 2009
|