95 కోట్లయిన వెయ్యి!
'ఇది ఎన్నికల సమయం. ఇక్కడ, అక్కడ అని లేకుండా విపరీతంగా డబ్బు చేతులు మారుతుంటుంది. ఎవరో పొరపాటున నా ఖాతాలోకి డబ్బు జమ చేసి ఉంటారని ఊహించాను' అని పవార్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ముందుగా జాగ్రత్త పడాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఎందుకంటే అకౌంట్స్ ఆడిట్ జరిగినట్లయితే, తన బ్యాలెన్స్ గురించి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి తలెత్తుతుంది.
ఎట్టకేలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్ఇఇపిజడ్ బ్రాంచ్ గురువారం ఆయన కాల్స్ కు స్పందించింది. 'ఢిల్లీ సర్వర్ సరిగ్గా పని చేయడం లేదు' అని పేరు వెల్లడి చేయవద్దనే అభ్యర్థనతో బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు. 'అకౌంట్ సమాచారం తప్పు. పవార్ ఒక వేళ ప్రయత్నించినప్పటికీ ఆయన ఆ డబ్బు విత్ డ్రా చేసుకోగలిగేవారు కారు' అని ఆ అధికారి చెప్పారు. కాగా, పవార్ కేసును ఎస్ఇఇపిజడ్ బ్రాంచ్ మేనేజర్ ఢిల్లీలోని హెడాఫీస్ కు నివేదించారు.
ఇక పవార్ తన అకౌంట్ బ్యాలెన్స్ ను గురువారం ఇంకా సరి చూసుకోలేదు. అది తన మామూలు బ్యాలెన్స్ మొత్తం రూ. 1000ని సూచించగలదని ఆయన ఆశిస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎటిఎం రసీదులను ఆయన చాలా కాలం పదిలంగా అట్టిపెట్టుకోగలరు.
Pages: -1- 2 News Posted: 23 October, 2009
|