సింహాన్ని దత్తత తీసుకోండి
వన్య మృగాల దత్తత ఆవశ్యకత గురించి లూనా మాట్లాడుతూ, 'బోధన చేయడమే సరిపోదని గ్రహించాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి క్రియను కోరుతున్నది. వన్యమృగ సంరక్షణకు జనం ఏవిధంగా మద్దతు ఇస్తున్నారో సూచించేందుకు ఈ దత్తత పథకం ఒక అద్భుత మార్గం' అని పేర్కొన్నారు. 'జనం తమకు అత్యంత ఇష్టమైన జంతువును ఒక ఏడాదికి లేదా కొన్ని నెలలకు దత్తత తీసుకోవడం ద్వారా దానికి ఆహారం, పారిశుద్ధ్యం నిర్వహణ, ఎన్ క్లోజర్ల పరిశుభ్రత, వైద్య ఖర్చుల కోసం నిధులు సమకూర్చిన వారవుతారు' అని ఆయన వివరించారు.
జంతువులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం కోసం వన్యమృగ సంరక్షణ విభాగం అధికారులు రకరకాల సదుపాయాలు కల్పించడానికి సిద్ధపడుతున్నారు. 'ఒక జంతువు దత్తత తీసుకునే వ్యక్తిని వివిధ ఉత్సవాలలో ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తాం, జూ అభివృద్ధి సంస్థలలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా నియమిస్తాం. ఆ వ్యక్తి పేరును బోర్డుపై ప్రదర్శిస్తాం. సంవత్సరానికి నాలుగు సార్లు జూను సందర్శించడానికి ఆయన కుటుంబానికి, ఐదుగురు వ్యక్తులకు ఫ్రీ పాసులను జారీ చేస్తాం' అని ఛత్ బీర్ జూ ఫీల్డ్ ఆఫీసర్ తుషార్ కాంతి 'ఐఎఎన్ఎస్' విలేఖరితో చెప్పారు. 'మాకు మంచి స్పందన వస్తున్నది. ఆసక్తి కలవారు వాకబు చేస్తున్నారు కూడా. వన్య మృగం దత్తత ఎప్పుడూ ప్రత్యేకత ఉన్నదే. పండుగలు, జన్మదినాలు, వార్షికోత్సవాలకు ఇది గొప్ప కానుక కాగలదు' అని కాంతి తెలిపారు.
వన్య మృగాన్ని దత్తత తీసుకున్న తరువాత సదరు వ్యక్తికి ఆ జంతువు ఆహారాన్ని, జీవన స్థితిగతులను పరిశీలించే హక్కు ఉంటుంది. తాను దత్తత తీసుకున్న జంతువుకు సంబంధించి ఏ సంజాయిషీనైనా అధికారుల నుంచి ఆయన కోరవచ్చు. ఎవరైనా మొత్తం సంవత్సరానికి లేదా ఏవో కొన్ని నెలలకు ఏ జంతువునైనా దత్తత తీసుకోవచ్చు. చార్జీలు రూ. 400 నుంచి రూ. 209, రూ. 200 వరకు ఉంటాయి.
కాగా, పర్యావరణవేత్తలు, ఆయా ప్రాంతాల వాసులు ఈ పథకం పట్ల చాలా ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. 'సుమారు రూ. 2 లక్షల ఖర్చుతో ఒక ఏడాది పాటు రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకోవాలని మేము సంకల్పించాం. ఈ జంతువులు కేవలం వినోదం కోసం కాదని అర్థం చేసుకోవాలి' అని ఒక ఎన్ జిఒను నడుపుతున్న పర్యావరణవేత్త రోహిత్ రుహెల్లా 'ఐఎఎన్ఎస్' విలేఖరితో అన్నారు.
Pages: -1- 2 News Posted: 23 October, 2009
|