అంతా జగన్నాటకమే! `సిఎల్ పి నేతగా రోశయ్యను ఈ సమావేశంలో నేరుగా ఎన్నుకొనవచ్చును. లేదా సిఎల్ పి నేతను ఎన్నుకునే అధికారం అధినేత్రి సోనియాగాంధీకే వదిలిపెడితే తీర్మానం చేయనూ వచ్చును. ఒకవేళ ముఖ్యమంత్రిగా రోశయ్యే ఎన్నికయ్యే పక్షంలో సభలో పార్టీ నాయకుడిగా జగన్ వీర విధేయ వర్గం నుంచి ఒకరిని ఆ కీలక పదవికి ఎంపిక చేస్తారన్నది అంచానా. సోనియా మాటే వేదవాక్కని జగన్ ప్రకటించిన తరువాత ఇంతకాలం ఆవేశాన్ని ప్రదర్శించిన ఆయన వర్గీయులందరూ కట్టగట్టుకుని జగన్ మాటే తమకు శిరోధార్యమని ఎలుగెత్తి చాటారు. గతంలోనే ఈ విధేయులు ఈ సంగతిని పదేపదే చెప్పారు. కానీ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం లేదని తెలిసిన తరువాత కూడా దానినే పునరుద్ఘటించడమే విశేషం. ఈ ధైర్యం అంత సులువుగా రాదనేది సుస్ఫష్టం. సోనియాగాంధీ నుంచి ఎంతో అనుకూల సంకేతాలు వస్తేనే గాని జగన్ వర్గం ఎలాంటి బెరుకు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయలేదనేది పరిశీలకుల అభిప్రాయం.
మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు జగన్ వెంటే ఉన్నారన్నది నిస్సందేహం. ఈ నేపథ్యంలో మరో నాలుగున్నర సంవత్సరాల పాటు కాంగ్రెస్ ను సమతూకంలో నడిపించడానికి అవసరమైన మంత్రాంగాన్ని సిఎల్ పి సమావేశం ద్వారానే అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి జగన్ మద్దతు లేకుండా రోశయ్యగాని, మరెవరైనా గానీ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగలేరన్నది అధిష్టానానికి స్పష్టంగా అర్ధమైందని విశ్లేషకుల ఉవాచ. తెలంగాణా విషయంలో కొత్తగా తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్ ను, కాంగ్రెస్ కుమ్ములాటలతో మధ్యంతరం వస్తుందనే ఆశతో పావులు కదుపుతున్న చంద్రబాబులను ఎదుర్కోనే బాధ్యతను జగన్ భుజస్కంధాలపైనే పెట్టబోతున్నారు. దీనికి పార్టీలో జగన్ అనుకూలురకు, జగన్ వ్యతిరేకులకు మధ్య సమతూకం, సమన్వయం సాధించే ఫార్ములాను సిఎల్ పి సమావేశం ద్వారా అధిష్టానం ఆవిష్కరించనుంది.
Pages: -1- 2 News Posted: 23 October, 2009
|