పేరుకే 'పుష్కర్'ణి!
పరిరక్షణ పథకం కోసం కేంద్ర ఐదు సరస్సులను ఎంపిక చేసింది. వాటిలో ఒకటైన పుష్కర్ సరస్సుకు 2006లో రూ. 48.52 కోట్లను కేంద్రం కేటాయించింది. 'తగినంత నీటిని నిల్వ చేయడం, మురుగు నీరు సరిగ్గా వెలుపలికి పారేట్లు చూడడం, పారిశుద్ధ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. మేము ప్రాథమిక పనులు పూర్తి చేశాం. ఒకసారి భారీ స్థాయిలో వర్షం పడినట్లయితే, సరస్సులో నీటి మట్టం కూడా పెరుగుతుంది' అని అధికారి ఒకరు చెప్పారు.
అయితే, ఇప్పట్లో భారీ స్థాయిలో వర్షం కురిసే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. కాని సుప్రసిద్ధ పుష్కర్ సంతకు నాలుగు లక్షల మందికిపైగా దేశీయ యాత్రికులు తరలిరాగలరు. క్రితం సంవత్సరం దాదాపు 35 వేల మంది విదేశీ పర్యాటకులు, నాలుగు లక్షల మందికి పైగా దేశీయ పర్యాటకులు ఈ సంత సీజన్ లో పుష్కర్ ను సందర్శించారు. 'కార్తీక పూర్ణిమ సందర్భంగా సాధారణంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు పుష్కర్ సందర్శిస్తుంటారు. దేశమంతటి నుంచి యాత్రికులు వచ్చి పుష్కర్ సరస్సు నీటిలో స్నానం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు' అని పుష్కర్ వాసి అయిన అర్చకుడు రమేష్ పరాశర్ తెలియజేశారు.
ఈ సంవత్సరం సరస్సులో అక్కడక్కడ గల నీటి తొట్టె పరిమాణపు చెలమలతో యాత్రికులు సరిపెట్టుకోవలసి ఉంటుంది. వాటినైనా రోజూ నీటితో నింపుతుంటారు. తల మునకకు తగినంత లోతు మాత్రం ఉండదు.
Pages: -1- 2 News Posted: 24 October, 2009
|