'మావో'లకు టైగర్లతో లింక్
మరి మావోయిస్టులు ప్రయోజనం పొందనున్నారా? 'లంక సైనికులతో పోరు సాగిస్తూ టైగర్లు గెరిల్లా వ్యూహంలో రాటు దేలారు కదా. వారు ఆ మెళకువలను మావోయిస్టులకు నేర్పుతారు' అని భద్రతా విషయాల విశ్లేషకుడు ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో తమకు వ్యూహాత్మకంగా బలమైన అబూజ్ మాద్ స్థావరంపై 'ఆపరేషన్ గ్రీన్ హంట్' సంకేత నామంతో కేంద్ర భద్రతా దళాలు జరిపే దాడిని తాము ఎదుర్కొనగలిగేలా మావోయిస్టులు తమిళ టైగర్ల సాయం తీసుకోగలరని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని ఓడించడమే ఈ దాడి లక్ష్యమని చిదంబరం పదే పదే స్పష్టం చేస్తుండడంతో మావోయిస్టు అగ్ర నాయకులలో 80 శాతం మేర ఉన్న ఆంధ్ర మావోయిస్టు నాయకులను పట్టుకోవడంపైన లేదా వధించడంపైన దృష్టి కేంద్రీకరించగలరని ఆ వర్గాలు తెలియజేశాయి.
'కేంద్ర బలగాలు అబూజ్ మాద్ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు అక్కడ ఆంధ్ర కమాండోలకు, మావోయిస్ట్ అగ్ర నాయకులకు మధ్య తిరిగి పోరు జరగగలదు. అందువల్ల మావోయిస్టులు టైగర్లపై ఆధారపడే అవకాశాలను తోసిపుచ్చలేం' అని భద్రతా విభాగం ప్రతినిధి ఒకరు చెప్పారు. తమ మిలిటరీ విభాగం 'పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ' (పిఎల్ జిఎ)కు శిక్షణ ఇచ్చేందుకు ఎల్ టిటిఇ తిరుగుబాటుదారుల సాయాన్ని మావోయిస్టులు స్వీకరించవచ్చునని కూడా ఆ వర్గాలు సూచించాయి.
ఎల్ టిటిఇ వ్యూహం ఒక కత్తికి రెండు మొనల వంటిదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు భారతీయ బలగాలను ఎదుర్కొనడంలో మావోయిస్టులకు సాయం చేస్తూనే మరొక వైపు శ్రీలంక ఉత్తర ప్రాంతాలలో లంక సైనికులతో పోరుకు దక్షిణాదిని తమ కొత్త స్థావరంగా చేసుకోవడం ద్వారా ఆ దేశంలో తిరిగి బలం పుంజుకోవడానికి ఎల్ టిటిఇ ప్రయత్నించగలదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 26 October, 2009
|